Begin typing your search above and press return to search.

కొవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా

By:  Tupaki Desk   |   6 Nov 2021 4:59 AM GMT
కొవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా
X
భారత స్వదేశీ కరోనా వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ టీకా తీసుకున్న వారిని దేశంలోకి అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. టీకా తీసుకున్న విదేశీయుల కోసం తాజాగా కొత్త ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసిన అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కొవాగ్జిన్‌ను జాబితాలో చేర్చింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అత్యవసర వినియోగం నిమిత్తం కొవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు తాజాగా ప్రంపచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ ఓ) అనుమతి లభించింది. భారత్ లో ఈ టీకాను విస్తారంగా వాడుతోన్నా, ఇండియా నుంచి పదుల కొద్దీ దేశాలకు ఎగుమతి అవుతున్నా కొవాగ్జిన్ కు గుర్తింపు ఇవ్వడంలో డబ్ల్యూహెచ్ ఓ చేసిన ఆలస్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా డబ్ల్యూహెచ్ ఓ వేదికపైనే ఆ సంస్థ తీరును ఎండగట్టడం తదితర పరిణామాల తర్వాతగానీ కొవాగ్జిన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇండియాకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్దిచేసి, ఇప్పటికే వివివిగా వినియోగిస్తోన్న కొవాగ్జిన కొవిడ్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం నాడు ఆమోదం తెలిపింది.

డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ అడ్వైజరీ బృందం. కొవాగ్జిన్ సమర్థతపై భారత్ బయో సమర్పించిన డేటాను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత, ఈ టీకాను 18 ఏళ్లు పైబడినవారు అత్యవసరంగా వినియోగించొచ్చని చెప్పడంతో ఆ మేరకు డబ్ల్యూహెచ్ ఓ కీలక ప్రకటన చేసింది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఇండియాలో రూపుదిద్దుకున్న తొలి వ్యాక్సిన్ అయిన కొవాగ్జిన్ కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించడంతో సుదీర్ఘకాలంగా నెలకొన్న అనేక సమస్యలు తీరిపోనున్నాయి.డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించనికారణంగానే భారత్ బయోటెక్ వివిధ దేశాలతో వ్యాక్సిన్ పంపిణీ ఒప్పందాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందరికంటే ముందుగా కొవాగ్జిన్ తయారైనప్పటికీ.. అనుమతి ఆలస్యంగా రావడంతో ప్రపంచ మార్కెట్ లో భారత టీకా అవకాశాలను కోల్పోయినట్లయింది.

కనీసం ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ లభించడం శుభపరిణామమే అవుతుంది. ఈఏడాది ఏప్రిల్ లోనే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా, సుదీర్ఘ కాలం తర్వాత నిర్ణయం వెలువడింది. ఇండియాలో తయారైన వ్యాక్సిన్లకు గుర్తింపు లభించని నేపథ్యంలో అగ్రదేశాల అధినేతలు, డబ్ల్యూహెచ్ ఓ సారధులు పాల్గొన్న ఓ కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ అతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూహెచ్ ఓ ఉద్దేశపూర్వకంగానే భారత్ ను చిన్నచూపు చూస్తున్నదని, ఈ తీరు మానుకోవాలని హెచ్చరించారు. కొవాగ్జిన్ సమర్థతపై విదేశాల్లో తొలి నుంచీ అనమానాలు కొనాసగుతుండటం, భారత్ లోనే తయారైన కొవిషీల్డ్(ఆస్ట్రాజెనెకా, సీరం తయారీ)కు మాత్రం అనుమతిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ ను పక్కన పెట్టడం వివాదాస్పదమైంది.