Begin typing your search above and press return to search.
అమెరికాలోని మనోళ్లకు ఆ ఆఫర్ అమల్లోకి
By: Tupaki Desk | 4 July 2017 7:18 AM GMTఅమెరికా వెళ్లే భారతీయులు అక్కడి విమానాశ్రయంలో దిగిన తర్వాత అత్యల్ప సమయంలోనే ఆ దేశంలోకి అడుగుపెట్టేందుకు అమెరికా ఇటీవల ఆమోదించిన గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ అమలులోకి వచ్చింది. అమెరికాలో భారత రాయబారి నవ్ తేజ్ సర్నా ఈ విధానం ద్వారా ఎంట్రీ అయిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ‘ఇంటర్నేషనల్ ఎక్స్ పెడిటెడ్ ట్రావెలర్ ఇనిషియేటివ్’గా పిలవబడే ఈ ప్రోగ్రామ్ లో 11 దేశాలకు అమెరికా అవకాశం ఇస్తుండగా అందులో భారతదేశం ఒకటి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం అనంతరం ఈ మేరకు అమెరికా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ తాజా అనుమతి ప్రకారం ఎయిర్ పోర్ట్ లోకి ప్రవేశించిన తర్వాత గ్లోబల్ ఎంట్రీ కియోస్క్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. యంత్రాలు చదవగలిగితే పాస్ పోర్ట్ కానీ లేదా అమెరికాలో శాశ్వత నివాస గుర్తింపు పత్రం కానీ పెట్టిన సంబంధిత స్కానర్ పై తమ వేలిముద్రలను ద్రువీకరించుకుంటే చాలు కస్టమ్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఈ కియోస్క్‌లోనే రశీదు పొంది బ్యాగేజ్ తీసుకొని ఎగ్జిట్ అయ్యేందుకు అనుమతి వస్తుంది. అయితే ఈ గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ కు ప్రయాణికులు ముందుగా అప్రూవ్ అయిన వారయి ఉండాలి. దీనిలో చేరడానికి ముందు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలన్నిటినీ లోతుగా చెక్ చేసుకున్న తర్వాత వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారని సీబీపీ వెబ్ సైట్ లో ఉంచిన వివరాలను బట్టి తెలుస్తోంది. అమెరికా కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్స్ తాత్కాలిక బాధ్యుడు కెవిన్ మెక్ అలియన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ విధానం మెరుగైన ప్రయాణ అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ప్రతిఏటా భారతదేశం నుంచి వచ్చే లక్షలాది మందికి ఈ విధానం ద్వారా సురక్షితమైన, రక్షణతో కూడిన ఎంట్రీ దక్కుతుందని అన్నారు.
అమెరికాలోకి అడుగు పెట్టిన తర్వాత ముందుగా ఆమోదించిన - లో రిస్క్ ప్రయాణికులకు సత్వర క్లియరెన్స్ లభించడం కోసం అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ (సిబిపి) అమలు చేస్తున్న కార్యక్రమమే ఈ గ్లోబల్ ఎంట్రీ. అమెరికాలోని న్యూయార్క్ - వాషింగ్టన్ - ఆస్టిన్ - డల్లాస్ - హ్యూస్టన్ - బోస్టన్ - చికాగో - శాన్ ఫ్రాన్సిస్కో - లాస్ ఏంజిల్స్ - లాస్ వేగాస్ - మియామి - సీటెల్ లాంటి అన్ని ప్రధాన అమెరికా విమానాశ్రయాల్లోను ఈ గోల్డెన్ ఎంట్రీ సదుపాయం ఉంది. ఈ ఎంట్రీలో భారత్ చేరడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతిస్తూ, దీనివల్ల అమెరికా, భారతీయ ప్రజల మధ్య మరింత సన్నిహిత వ్యాపార, విద్యా సంబంధాలు నెలకొనేందుకు వీలవుతుందని పేర్కొన్నట్లు ట్రంప్, మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/