Begin typing your search above and press return to search.

బాబు మరక ఎలాంటిదో చెప్పిన తాజా రిపోర్ట్

By:  Tupaki Desk   |   10 Nov 2019 9:22 AM GMT
బాబు మరక ఎలాంటిదో చెప్పిన తాజా రిపోర్ట్
X
తన హయాంలో ఏపీకి జరిగినంత మేలు మరెప్పుడూ జరగలేదన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదే పనిగా చెబుతుంటారు. మరి.. ఆయన మాటలకు చేతలకు మధ్య ఉన్న అంతరం ఎంతన్న విషయం తాజాగా విడుదలైన ఒక నివేదిక ఇట్టే చెప్పేస్తుంది. 2016లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న మరణాలు - ఆత్మహత్యలకు సంబంధించిన అధ్యయనాన్ని నిర్వహించింది ఎన్సీఆర్బీ (జాతీయ నేర గణాంక సంస్థ)
ఈ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. ఆరో స్థానంలో తెలంగాణ ఉన్నట్లు తేలింది. వ్యవసాయ రంగంపై అత్యధికంగా ఆధారపడి ఆత్మహత్య చేసుకున్న వారు వందల్లో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.

దేశ వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న అన్నదాతలు.. వ్యవసాయ కూలీలు 11,379 మంది ఉంటే.. వారిలో ఏపీకి చెందిన వారు 7.06 శాతం మంది కాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 5.66 శాతం. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సొంతభూమి ఉన్న రైతులు.. రైతుకూలీలు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించారు. ఏపీలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 730 మంది పురుషులు ఉంటే.. 74 మంది మహిళలు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల్లో పురుషులు 572 మంది ఉండగా.. మహిళలు 73 మంది ఉన్నారు.

తన పాలన గురించి గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. తాజాగా విడుదలైన ఈ నివేదిక మీద ఏమని బదులిస్తారు? అన్నదాతలకు తాను చేసినంత మంచి మరెవరూ చేయలేరని తరచూ గొప్పలు చెప్పుకునే బాబు మాటల్లో నిజం ఎంత డొల్ల అన్నది తాజాగా విడుదలైన నివేదికను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.