Begin typing your search above and press return to search.
బాబూమోహన్ ను చంపాలనుకున్నది ఎవరు?
By: Tupaki Desk | 8 May 2017 10:05 AM GMTఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం టీఆరెస్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ సినీ నటుడు బాబూమోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కిళ్లీలో విషయం కలిపి తనను చంపాలని ప్లాన్ చేశారని ఆయన అన్నారు. అయితే... ఆ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తే తన వద్దకు వచ్చి కాళ్లపై పడ్డాడని.. దాంతో అతణ్ని వదిలేశానని చెప్పారు.
తన రాజకీయ, వ్యక్తిగత జీవితాల గురించి మనసు విప్పి మాట్లాడిన ఆయన ఎన్నో ఆసక్తికర, సంచలన విషయాలు తెలిపారు. తన కొడుకు చనిపోయిన తర్వాత బతకడం వేస్ట్ అనే స్థితిలోకి చేరానని.. కానీ, తర్వాత కాలంలో చోటుచేసుకొన్న మార్పులతో సాధారణ జీవితంలోకి అడుగుపెట్టినట్టు ఆయన చెప్పారు. సినిమాల్లో నటించే సమయంలో తనికెళ్ళ భరణి ద్వారా పాన్ లు తినే అలవాటు వచ్చిందన్నారు. ప్రతిరోజూ తాను ఎక్కడికి వెళ్ళినా హైద్రాబాద్ లోని ఓ పాన్ షాపులో పాన్ లు కట్టించుకొనే తీసుకెళ్ళేవాడిని.అయితే ఈ పాన్ లో విషం కలిపి చంపాలని ప్రత్యర్థులు కుట్రపన్నారని తెలిసి ఆ షాపులో పాన్ లు కట్టించుకోవడం మానేసినట్టు ఆయన చెప్పారు. అయితే, తనను చంపించాలనుకున్నదెవరో మాత్రం ఆయన చెప్పలేదు.
తాను త్రిగా ఉన్న సమయంలోనే జిల్లా ఎస్పీ కిళ్లీలో నా విషం పెట్టి చంపే ప్రమాదం ఉందని హెచ్చరించారని.. ఆయన ఊరికే ఆ మాట చెప్పలేదని అర్థం చేసుకుని అప్పటి నుంచి ఆ షాపులో పాన్ లు కట్టించుకోవడం మానేసినట్టు చెప్పారాయన. అయితే తనకు పాన్ లో విషం పెట్టాలనుకొన్న వ్యక్తి తన కాళ్ళ మీద పడి ఏడ్చాడని చెప్పారు.అయితే ప్రత్యర్థులు పన్నిన కుట్రలో అతను ఈ పనిచేశాడని అతడిని వదిలేసినట్టు చెప్పారు.
టిఆర్ఎస్ లోచేరిన తర్వాత మరోసారి మంత్రిపదవిని చేపట్టాలనే ఆశలేదన్నారు బాబుమోహన్, కెసిఆర్ తనకు గాడ్ పాదర్ అన్నారు. ప్రశాంత జీవితాన్ని కోరుకొంటున్నానని.. మంత్రి పదవులేమీ వద్దని అన్నారు. ముఖ్యమంత్రి కూడ మెదక్ జిల్లా నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అదే జిల్లాకు చెందిన తనకు మంత్రి పదవి ఇంక అవసరం లేదని చెప్పారు. రాజకీయంగా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ పిలిచి టిక్కెట్టు ఇచ్చారని.. అది చాలని చెప్పారు. పెద్దకొడుకు చనిపోవడంతో సైలెంటయ్యాను. ఆ సమయంలో జీవితం ఇక చాల్లే అనుకొన్నానని బాబుమోహన్ చెప్పారు. సినిమాల్లో నటుడిగా వెలుగొందాను. ప్రభుత్వ ఉద్యోగం చేశాను. మంత్రిగా పనిచేశాను. అన్నీ అయిపోయాయి.ఈ జీవితం ఎందుకు అనుకొన్నానని చెప్పారు. చచ్చిపోతే తన కొడుకు వద్దకు పోవచ్చనిపించింది. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించేదన్నారు. ఎప్పుడూ తలుపులేసుకొని గదిలో ఉండేవాడినని చెప్పారు. ఎంతోమందికి అన్నం పెట్టాను,. పెళ్ళిళ్ళు చేశాను.సహయం చేశాను. కానీ, ఈరోజు తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటా.. అని ఓ రోజు తలుపులు తీసుకొని గది నుండి బయటకు వచ్చానని బాబుమోహన్ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/