Begin typing your search above and press return to search.

కిమ్ సోదరి ఎంత డేంజరో తెలుసా?

By:  Tupaki Desk   |   27 April 2020 2:30 AM GMT
కిమ్ సోదరి ఎంత డేంజరో తెలుసా?
X
కరోనా వైరస్ ను మించి ఉత్తర కొరియా అధ్యక్షుడు కం నియంత కిమ్ జాంగ్ గురించే ఇప్పుడంతా చర్చ జరుగుతోంది. ఆయన పరిస్థితి విషమించిందని.. మరణానికి చేరువగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు అమెరికా సహా ప్రపంచాన్ని భయపెట్టిన ఈ నియంత మరణంతో ఉత్తరకొరియాలో నియంతృత్వం పోతుందా? ఆయన తర్వాత ఎవరివి పగ్గాలనేవి ఆసక్తిగా మారింది.

కిమ్ మరణిస్తే ఆయన తరువాత ఉత్తరకొరియాను నడిపించేది ఎవరనేది దాదాపు ఖాయమైంది. కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ పగ్గాలు చేపట్టడం ఖాయమని తేలింది. ఈ నేపథ్యంలో అన్నను మించిన ఆవేశపరురాలు.. నియంతృత్వ లక్షణాలు కిమ్ యోజోంగ్ లో ఉన్నాయంటున్నారు. అన్న తరువాత ఆ దేశంపై సర్వాధికారాలు ఆమెవేనట.. కిమ్ కంటే దారుణంగా ఆమె వ్యవహారశైలి ఉంటుందని వార్తలొస్తున్నాయి.

కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆయన సోదరి ‘కిమ్-యే-జాంగ్’ అందిపుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఉత్తరకొరియా దేశంపై కిమ్ యే జాంగ్ పూర్తిగా పట్టు సాధించారని సమాచారం. ఈ మేరకు కిమ్ జాంగ్ మరణంతో అక్కడ ఈ నియంత కుటుంబాన్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిద్దామని ఎదురుచూస్తున్న దేశాలకు హెచ్చరికలు కూడా పంపినట్టు తెలిసింది.

కిమ్ జాంగ్ ఉన్ లక్షణాలనే చిన్నప్పటి నుంచి ఆయన సోదరి కిమ్ యే జాంగ్ వంటపట్టించుకున్నారట.. వాళ్ల కుటుంబంలో అన్నకు తోడు సర్వాధికారాలు కలిగి ఉంటే దేశంలో పాలనలో తనదైన ముద్ర వేస్తుందట.. ఆ మధ్య దక్షిణ కొరియాను ఈమె కుక్క మొరుగుతోందంటూ హెచ్చరించడం దుమారం రేపింది. కిమ్ జాంగ్ ఉన్ కంటే ఆయన సోదరి మరింత కఠినాత్మురాలు.. డేంజర్ అని ఆ దేశస్థులు చెబుతున్నారు.

అధ్యక్షుడు కిమ్ జాంగ్ పాలన వ్యవహరాల్లో ఒక్క తన చెల్లెలు అయిన కిమ్ యే జాంగ్ నే నమ్ముతారు. విదేశీ నాయకులతో, దక్షిణ కొరియాతో ఎలా డీల్ చేయాలో చెల్లెలు చెప్పినట్టు కిమ్ చేస్తారని ప్రచారంలో ఉంది. దీంతో కిమ్ మరణిస్తే నెక్ట్స్ వారసురాలు ఆమే కానుంది. కిమ్ కంటే కఠినంగా ఈమె ఉంటుందని తెలియడంతో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి.