Begin typing your search above and press return to search.
చెరువు గట్టులో పాతిక లక్షల కొత్తనోట్లు!
By: Tupaki Desk | 20 Dec 2016 10:45 AM GMTపెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం డబ్బు దాచడం అనే విషయంలో రకరకాల క్రియేటివిటీ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్ రూం లోని బాత్ రూంలో కోట్ల రూపాయలు దాచిన వాడు ఒకడైతే, శ్మశానంలో దాచిన వాడు మరొకడు. ఇలా రకరకాల క్రియేటివిటీని డబ్బు దాచడానికి ఉపయోగిస్తున్నారు నల్లబాబులు. ఈ క్రమంలో అక్కడక్కడా కొత్తనోట్ల కట్టలు పోలీసులకో - ఐటీ అధికారులకో దొరుకుతున్నప్పటికీ వాటి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో తాజాగా చెరువు కట్టలో రూ. 25 లక్షల కొత్త నోట్లు బయటపడ్డాయి. నాలుగువేల రూపాయల కోసం బ్యాంకుల ముందు అన్నీ వదిలేసి మరీ క్యూ కట్టి నిలబడితే రెండు గంటల తర్వాత "నో క్యాష్" అని బోర్డు ప్రత్యక్షమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా రూ.25 లక్షలు ఒకే చోట దొరకడం స్థానికంగా కలకలం సృష్టించింది.
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో కొత్త నోట్లు భారీగా బయటపడ్డాయి. చెరువు కట్టలో దాచిపెట్టిన సుమారు రూ. 25లక్షల విలువైన కొత్త నోట్లు ముగ్గురు చిన్నారుల కంటబడ్డాయి. అయితే ఈ ముగ్గురు ముదురు చిన్నారులు ఎవరో దాచి పెట్టిన ఆ సొమ్ము దొరకడంతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ ముగూరి మధ్య పంపకాలు మొదలయ్యాయి. అయితే ఆ పంపకాల్లో చిన్న తేడా వచ్చింది. ఎక్కువ మొత్తం తనకు కావాలంటే తనకు కావాలని వాగ్వాదానికి కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఒకడు నేరుగా వెళ్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసిన పోలీసులు మొత్తం రూ. 25లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే... ఆ చెరువు గట్టులో దాచిన ఆ సొమ్ము ఎవరిదనేది తెలియాల్సి ఉంది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/