Begin typing your search above and press return to search.
అడిగింది తప్ప.. అన్నీ చెప్పిన పవన్ కల్యాణ్!
By: Tupaki Desk | 13 Nov 2019 3:47 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియం కు సంబంధించి తన ప్రత్యర్థుల ను ఒకే ప్రశ్న అడిగారు. పేద-మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠ శాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను మీరు అంతగా ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఇంతకీ మీ పిల్లలు ఏ మీడియంలలో చదివారు? అని జగన్ అడిగారు.
ఆ ప్రశ్నను చంద్రబాబునాయుడు కు, వెంకయ్య నాయుడు కు, పవన్ కల్యాణ్ కు వేశారు. ఎందుకంటే వారే జగన్ విధానాలను విమర్శించినది. అయితే ఆ ప్రశ్నల కు చంద్రబాబు నాయుడు, వెంకయ్యలు స్పందించ లేదు. తమ పిల్లలు తెలుగు మీడియం లో చదినట్టుగా అయితే వాళ్లు ఈ పాటికి స్పందించేవాళ్లు. ఎలాగూ ఇంగ్లిష్ మీడియంలలో చదివించి ఉంటారు కాబట్టి వారు జగన్ ప్రశ్న కు మారు మాట్లాడ లేదు.
ఇక పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చి నానా హడావుడి చేశారు. తను చాలా సంస్కారిని అంటూ, ఏ మాత్రం సంస్కారం లేకుండా చెప్పుకున్నారు జనసేన అధినేత.
ఏదేదో మాట్లాడారాయన. ఇలాంటి నేపథ్యం లో అసలు ప్రశ్న కు మాత్రం పవన్ సమాధానం ఇవ్వ లేదు! తన పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారో పవన్ చెప్పలేదు. పవన్ కల్యాణ్ పిల్లలు తెలుగు మీడియం లో చదివే అవకాశాలు ఏ మాత్రం ఉండవు. అందుకే కాబోలు ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్ప లేదు. తను జగన్ అలా అన్నాడు, ఇలా అన్నాడు.. అంటూ పవన్ ఏదేదో అన్నాడు కానీ, తన పిల్లలు తెలుగు మీడియం లో చదవినట్టుగా మాత్రం చెప్పలేదు. అసలు విషయం గురించి మాట్లాడకుండా, అరగంట మాట్లాడి .. పవన్ ఏవేవో లెక్చర్లు చెప్పి తప్పించేసుకున్నాడు. అదీ సంగతి!