Begin typing your search above and press return to search.

ఇంతకూ బ్రిటన్ అనౌన్స్ చేసిన అన్ లిమిటెడ్ ఆఫర్ ఏంది?

By:  Tupaki Desk   |   28 Jan 2020 5:25 AM GMT
ఇంతకూ బ్రిటన్ అనౌన్స్ చేసిన అన్ లిమిటెడ్ ఆఫర్ ఏంది?
X
అగ్ర రాజ్యం తమ దేశంలోకి నైపుణ్యం ఉన్న నిపుణులు కావాలని కోరుకోవటానికి మించిందేముంది? తాజాగా అగ్ర రాజ్యమైన బ్రిటన్ అన్ లిమిటెడ్ ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఈ ప్రకటనను ఆ దేశ ప్రధాని స్వయంగా వెల్లడించటం ఒక విశేషమైతే.. ఆఫర్ కు తగ్గట్లే అవకాశాలు భారీగా ఉండటం మరో విశేషంగా చెప్పాలి. అగ్రశ్రేణి పరిశోధకులు.. శాస్త్రవేత్తలు.. గణిత నిపుణులు ఎంతమంది ఎన్ని వీసాలు కోరుకుంటే.. అన్ని వీసాలు ఇచ్చేలా చూడటమే కాదు.. వేగంగా ఆ పని సాగేలా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు.


ప్రపంచంలోని ప్రతిభావంతులకు తాము ఆహ్వానం పలుకుతున్నామని.. శాస్త్రీయ పరిశోధనలకు బ్రిటన్ పెద్ద పీట వేస్తుందని.. ఇందుకోసం మానవ వనరులపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నట్లు ఆ దేశం చెబుతోంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా వీసా నిబంధనల్ని కఠినం చేసిన సమయంలో అందుకు భిన్నంగా బ్రిటన్ అన్ లిమిటెడ్ ఆఫర్ అంటూ తలుపులు ఓపెన్ చేసిన వైనం మన దేశంలోని నిపుణులకు సాయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా మార్చిన నిబంధనల్ని ఫిబ్రవరి 20 నుంచి అమలు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులను ఆకర్షించేందుకు అనువైన సులుభతర.. వేగవంతమైన వీసా జారీ వ్యవస్థ దిశగా బ్రిటన్ అడుగులు వేయటం.. ఇందుకు సంబంధించినకీలక ప్రకటన వేయటం వెనుక భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి విజేత కమ్ బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షుడు వెంకీ రామకృష్ణన్ ఉన్నారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ను మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం సాయం చేస్తుందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు.. పరిశోధకులకు ఈ ఆఫర్ అండగా నిలవటమే కాదు.. ఉద్యోగం లేకున్నా బ్రిటన్ కు వెళ్లే అవకాశం ఈ కొత్త విధానం అవకాశం ఇవ్వటం మరో విశేషం. సో.. ప్రయత్నం చేస్తే పోయేదేముంది చెప్పండి? మన టాలెంట్ వేరే వాడికి అవసరమంటే.. చూస్తూ ఊరుకోవటం ఎందుకు? మన టాలెంట్ వారికిచ్చి.. దేశ ఖ్యాతిని మరింత ఇనుమడించేలా చేయటం తప్పేం కాదు కూడా.