Begin typing your search above and press return to search.

మే 4 నుండి ఆన్ లైన్ సర్వీసులు అన్ లాక్ .. !

By:  Tupaki Desk   |   3 May 2020 1:30 AM GMT
మే 4 నుండి  ఆన్ లైన్ సర్వీసులు అన్ లాక్ .. !
X
దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన రెండో దశ లాక్ డౌన్ గడువు మే 3 తో ముగియబోతున్న నేపథ్యంలో ..తాజాగా మరోసారి కేంద్రం లాక్ డౌన్ గడువు మరో రెండు వారాలు పొడగిస్తునట్టు ప్రకటించింది. లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా లేటెస్ట్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ కామర్స్ ప్లాట్ ఫాంలకు రిలీఫ్ ఇచ్చింది. మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చింది.

ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతినివ్వగా.. తాజా మార్గదర్శకాలతో నిత్యావసరేతర వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెడ్ జోన్లలో మాత్రం నిత్యావసర వస్తువుల్లో కిరాణా సరుకులు, మెడికల్, చిన్నారులకు సంబంధించి వస్తువలపై పరిమితంగా డెలివరీ చేసేలా అనుమతి ఇచ్చింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ప్రజలకు అవసరమైన వస్తువులను సురక్షితంగా డెలివరీ చేసేందుకు ప్రభుత్వం తమకు అనుమతినిచ్చేలా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపాయి.

మిలియన్లలో చిన్న, మధ్య వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని నిర్వహించేందుకు అనుమతి లభించినట్టు ఈ కామర్స్ దిగ్గజం ఈమెయిల్ స్టేట్ మెంట్ లో పేర్కొంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నివసించే వినియోగదారులు మే 4 నుంచి నాన్ ఎసెన్షియల్ వస్తువుల కేటగిరీ కింద స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ సహా ఇతర గాడ్జెట్లు, ఇతర ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు. ఈ జోన్ల లో ఉండే వారి ఆర్డర్లను మాత్రమే అంగీకరించనున్నాయి.