Begin typing your search above and press return to search.

ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ షురూ.. సరి, బేసి విధానంలో షాప్స్ !

By:  Tupaki Desk   |   5 Jun 2021 11:30 PM GMT
ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ షురూ.. సరి, బేసి విధానంలో షాప్స్ !
X
దేశ రాజధాని ఢిల్లీ కరోనా మహమ్మారి నుండి దాదాపుగా కోలుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం 50 రోజుల తర్వాత దేశ రాజధాని లాక్‌ డౌన్ నుండి బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుతుండడంతో సీఎం కేజ్రీవాల్ పలు అన్‌ లాక్ ప్రక్రియ పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుండి సడలింపులు ఇచ్చారు. దీనితో మెట్రో రైళ్లలో యాబై శాతం ప్రయాణికులను అనుమతించడంతోపాటు పలు మార్కెట్‌ లోని షాపులకు సరి,బేసి విధానంలో తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ నిబంధనలు జూన్ 14 వరకు కొనసాగనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలకు యాబై శాతం సిబ్బందితో అనుమతి ఇచ్చారు. కాగా ప్రభుత్వ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో కొనసాగుతాయని చెప్పారు.

అయితే వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. మరోవైపు లాక్‌ డౌన్ కొనసాగుతుందని అయితే సరి, బేసి సంఖ్య విధానంలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటలవరకు కొనసాగనున్నట్టు ప్రకటించారు. అంటే రాత్రీ ఎనిమిది గంటల నుండి ఉదయం పది గంటల వరకు కర్ఫ్యూ ఉండే అవకాశం ఉంది. కాగా కరోన కేసుల ఉదృతి, ఆక్సిజన్ కొరత, వెంటిలెటర్స్ లేకపోవడంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఈనేపథ్యంలోనే గడిచిన ఏప్రిల్‌ లో నెలలో వారంతపు లాక్‌ డౌన్‌ను ప్రారంభించిన ప్రభుత్వం కేసుల సంఖ్య ఎక్కువవడంతో ఏప్రిల్ 19న పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించింది. దీనితో అప్పటి నుండి జూన్ ఏడు వరకు పొడగిస్తూ వచ్చింది.ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మొత్తం 50 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌ డౌన్ కొనసాగింది. ఇక ఈ మధ్య కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు కావడంతో లాక్‌డౌన్ నిబంధలను సడలించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నిర్ణయం తీసుకున్నారు.ఇక ఢిల్లీలో ప్రభుత్వం విడుదల చేసిన గణంకాల ప్రకారం శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 523 పాజిటివ్ కేసులు నమోదు కాగా 50మంది మృత్యువాత పడ్డారు.