Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకోకున్నా..కలిసి ఉండవచ్చు: హైకోర్టు
By: Tupaki Desk | 2 Jun 2018 4:36 AM GMTసహజీవనం విషయంలో ఎదురవుతున్న అనేక సందేహాలకు కోర్పు తీర్పు ఇచ్చింది. వివాహం కాకుండా..కలిసి ఉండటం తప్పేం కాదని కేరళ హైకోర్టు శుక్రవారం ఓ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకోకపోయినా ఓ 18 ఏళ్ల యువకుడు - 19 ఏళ్ల యువతి కలిసి ఉండటానికి అనుమతి ఇచ్చింది. సహజీవనాన్ని తప్పుబట్టలేమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మైనారిటీ తీరిన యువతీ యువకులకు సహజీవనం చేసే హక్కు ఉందంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తుచేసింది. తద్వారా సహజీవనం చేస్తున్న 18 ఏళ్ల యువకుడు - 19 ఏళ్ల యువతిని విడదీయటానికి కేరళ హైకోర్టు అంగీకరించలేదు.
యువకుడికి వివాహ వయసు లేనందున తన కూతురిని అతడి వద్ద ఉండడం సరికాదంటూ యువతి తండ్రి కేరళ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ వీ చితంబరేష్ - జస్టిస్ కేపీ జ్యోతీంద్రనాథ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. వాళ్లు మేజర్లు కావడం వల్ల హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌తో వాళ్లను విడదీయలేమని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టంచేసింది. ఇది సమాజ సాంప్రదాయాలకు విరుద్ధంగా అనిపించినా.. మేజర్లు కావడంతో రాజ్యాంగబద్ధంగా వాళ్లకు సంక్రమించిన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉన్నదని కోర్టు తెలిపింది. సదరు యువకుడికి చట్టబద్ధంగా పెళ్లి చేసుకొనే వయసు వచ్చే వరకు అతనితో స్వేచ్ఛగా జీవించే హక్కు ఆ యువతికి ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది.సహజీవన దృష్టాంతాలు సమాజంలో పెద్దసంఖ్యలో కనిపిస్తున్నప్పుడు.. ఆ సత్యాన్ని చూడటానికి నిరాకరించలేమని ధర్మాసనం పేర్కొంది. ఆ యువతి తండ్రి వేసిన పిటిషన్ కొట్టేశారు. యుక్త వయసులో ఉన్న యువతీ యువకులకు చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వయసు రాకపోయినా సహ జీవనం చేసే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన నెల రోజుల్లోనే కేరళ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.