Begin typing your search above and press return to search.

పెళ్లికాని పాటిదార్ సమాజ్ యువకులు.. పిల్ల కోసం ఎదురుకట్నం?

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:30 PM GMT
పెళ్లికాని పాటిదార్ సమాజ్ యువకులు.. పిల్ల కోసం ఎదురుకట్నం?
X
సమాజంలో పెళ్లికాని ప్రసాద్ లు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా కొన్ని సామాజికవర్గాల్లో అబ్బాయిలకు 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదు. బ్రాహ్మణ, వైశ్య, వెలమ సహా కొన్ని కులాల్లో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆ కులంలోని యువకులు ఎదురుకట్నం ఇచ్చి.. పెళ్లి ఖర్చులన్నీ భరించి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ కులాల్లో అమ్మాయి ఉంటే బంగారంగానే మారింది. ఆమెకు ఆస్తిపాస్తులు బోలెడన్నీ వచ్చిపడుతున్నాయి. దేశంలోనే కాదు అమెరికాలోనూ కొన్ని సామాజికవర్గాల్లోని యువకులకు పెళ్లి కాని పరిస్థితి ఏర్పడింది. దాన్ని భారత్ లోని ఆ కులం వారు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. విదేశాల్లో మంచి జాబ్ ఉండి తాహతు ఉన్నవారికి పిల్లనిస్తున్నారు. దానికి ఎదురుకట్నంగా 30 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. పెళ్లికోసం ఆ సామాజికవర్గాలు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

భారతీయులకు ఆది నుంచి అమెరికా సంబంధం అంటే ఒక మోజు. ఆ సంబంధం కోసం లక్షలు తగలేస్తుంటారు. ఒక నియమం ప్రకారం.. ఎన్నారై వరులు మరియు వధువుల సంబంధాలపై ఆరాతీస్తుంటారు. ఈ సంబంధాల విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తూ '42 గామ్ పాటిదార్ సమాజ్' ఏకంగా కొన్ని నిబంధనలు పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ సమాజ్ వారు అబ్బాయి వివాహానికి అర్హత పొందాలంటే ఎన్నారైగా ఉండాలనేది తప్పనిసరి నియమం పెట్టారు. ఎందుకంటే భారత్ లో, అమెరికాలో ఈ పాటిదార్ సమాజ్ వారి జనాభా చాలా తక్కువ. కొంతమంది గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాల్లో అతితక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుకే కులంలో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉండడంతో అమ్మాయిలకు డిమాండ్ విపరీతంగా ఉంది..

పాటిదార్ సమాజ్ లో వారి బంధువులలో ఎవరైనా.. లేదా వరుడు విదేశాలలో నివసించాలని వీరు నిబంధన పెట్టారు. ఫారెన్ సంబంధాలకే పిల్లనిస్తామని కండీషన్ విధించారు. వరుడు విదేశాలలో నివసించనట్లయితే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ముఖ్యంగా అమెరికా, కెనడా లేదా యూకేలో నివసిస్తున్న వరుడులకే సంబంధాలు కలుపుతారు. లేకుంటే అతను వివాహం చేసుకునే అవకాశాలు చాలా వరకు శూన్యంగా చెప్పొచ్చు.

సమాజ పెద్దల నిర్ణయంతో వారి సంఘంలో చాలామంది పెళ్లికాని అబ్బాయిలు మిగిలిపోతున్నారు. ఎందుకంటే దేశంలో పాటిదార్ లలోని చాలామంది విదేశాలకు వెళ్లలేరు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సమాజ్ కులంలో విదేశాలలో స్థిరపడిన లేదా నివసిస్తున్న అమ్మాయికి ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అంటే చట్టవిరుద్ధంగా లేదా చట్టబద్ధంగా ఆమెను విదేశీ దేశానికి తీసుకెళ్లడానికి అమ్మాయి కుటుంబం డిమాండ్ చేసిన డబ్బులను అబ్బాయి కుటుంబం చెల్లిస్తుందన్నమాట..

పాటిదార్ కమ్యూనిటీకి ఒక ప్రత్యేక సమస్య ఉంది. అందులో అబ్బాయిల జనాభా ఎక్కువగా.. అమ్మాయిలది తక్కువగా ఉంది. అమ్మాయిల లింగ నిష్పత్తి దారుణంగా పడిపోయింది. వారు తమ కులంవారినే వివాహం చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో ముఖ్యంగా అబ్బాయిలు ఒత్తిడికి గురవుతున్నారు. దీని ఫలితంగా ఇప్పటికే అమెరికా ,కెనడా ,యూకేలో ఉన్న ఎన్ఆర్ఐ అబ్బాయిలు తమకోసం ఎవరైనా అమ్మాయిలు లేదా మహిళలు కావాలని కోరుతున్నారు. వేరే కులం వారైనా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

మా కులంలో అంత కట్నం చెల్లించడం మా వల్ల కాదంటున్నారు. పటీదార్ లలో అమ్మాయికి ఎదురుకట్నంగా రూ. 15 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు ఇస్తున్నారు.. ఈ గుజరాతీ కమ్యూనిటీలో వధువు కావాలంటే ఎన్‌ఆర్‌ఐ ఇంత చెల్లించి చేసుకోవాలి. లేదంటే వేరే కులం వారిని వివాహమాడాల్సిన పరిస్థితులు దాపురించాయి.