Begin typing your search above and press return to search.

ఉన్నావ్ రేప్ కేసు : బీజేపీ ఎమ్మెల్యే కి ఉరి ఖరారు కాబోతుందా?

By:  Tupaki Desk   |   20 Dec 2019 7:27 AM GMT
ఉన్నావ్ రేప్ కేసు : బీజేపీ ఎమ్మెల్యే కి ఉరి ఖరారు కాబోతుందా?
X
దిశ ఘటన కంటే ..ఎక్కువగా దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి కేసులో సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెన్‌ గర్‌ ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో భాగంగా ఆయనకి శిక్ష ఖరారు పై శుక్రవారం కోర్టు తేల్చనుంది. మంగళవారం దోషిగా తేల్చిన జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ శుక్రవారం శిక్షను ఖరారు చేయనున్నారు.

2017లో ఉన్నావ్‌‌లో ఉద్యోగం కోసం అని వెళ్లిన యువతిపై ఎమ్మెల్యే అత్యాచారంకు పాల్పడ్డాడు. ఇక కేసులో కుల్దీప్‌ సెన్‌గర్‌కు యావజ్జీవ శిక్ష విధించాలని సీబీఐ వెల్లడించింది. అత్యాచార ఘటనల్లో అమ్మాయిలు పడ్డ వేదనను కోర్టు గ్రహించాలని నిందితులను అత్యంత క్రూరమైన నేరస్తులుగా పరిగణించి వారికి కఠిన శిక్ష విధించాలని సీబీఐ తరపున వాదించిన లాయరు చెప్పారు.

అలాగే , సెన్‌గర్‌ పై అత్యాచారం కేసుతో పాటు పోక్సో చట్టంకూడా నమోదైంది. యువతి పై అత్యాచారం జరిగినప్పుడు ఆమె ఇంకా మైనరే. అయితే తనకు ఉత్తర్ ప్రదేశ్‌ లో న్యాయం జరగదని కేసును మరో చోటికి బదిలీ చేయాలని అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ కు లేఖ రాయడం తో ఆయన కేసును ఢిల్లీకి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఇక అత్యాచారం కేసుతో పాటు బాధితురాలి తండ్రిపై అన్యాయంగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసు, జ్యుడిషియల్ కస్టడీ లో ఉన్న సమయంలో ఆయన మృతి చెందడం వెనక సెన్‌గర్ కుట్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాదు అత్యాచార బాధితురాలు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ట్రక్కు వచ్చి ఢీకొనడం వెనక కూడా సెన్‌గర్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కారును ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా అత్యాచార బాధితురాలు మాత్రం ప్రాణాలతో బయటపడింది.ఈ కేసులో ఎట్టకేలకు దోషిగా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ను కోర్టు తేల్చిన సందర్భంలో ... ఆయనకి కోర్టు ఏ శిక్షని విధించబోతుంది అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.