Begin typing your search above and press return to search.

మాకు హైదరాబాద్ తరహా న్యాయం కావాల్సిందే!

By:  Tupaki Desk   |   7 Dec 2019 10:35 AM GMT
మాకు  హైదరాబాద్ తరహా న్యాయం కావాల్సిందే!
X
" దిశ " ఈ పేరు గత కొన్ని రోజుల ముందు వరకు ఎవరికీ అంతగా పరిచయం లేదు. కానీ , ఇప్పుడు ఈ పేరు దేశంలో ఒక సంచలన. వెటర్నరీ డాక్టర్ అయిన దిశ ని నలుగురు కామాంధులు ..హైదరాబాద్ నగర శివార్లలో నమ్మించి అఘాయిత్యం చేసి - హత్య చేసి - పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటన తో దేశం మొత్తం పెద్ద ఎత్తున నిరసన లు మొదలైయ్యాయి. వారిని వెంటనే ఉరి తీయాలంటూ ప్రజలు పెద్దఎత్తున బయటకి వచ్చారు. ఆ తరువాత పోలిసుల ఎన్ కౌంటర్ లో ఆ నలుగురు నింధితులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై దేశ ప్రజలు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశ కేసులో ఇంత త్వరగా న్యాయం జరుగుతుంది అని ఎవరు ఊహించలేదు. దీనితో ప్రతి ఒక్కరు కూడా దిశ కి తగిన న్యాయం జరిగిందని..ఇలా చేస్తేనే - ఇక పై ఇంకెవరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉంటారని చెప్పుకొచ్చారు.

ఇకపోతే గత కొన్ని రోజుల ముందు ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ బాధితురాలిపై 2018 డిసెంబర్ లో అత్యాచారం జరిగింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు నవంబర్ 30న బెయిల్ పై విడుదలయ్యారు. బాధితురాలిపై కక్ష పెంచుకున్న నిందితులు పక్కా ప్లాన్ తో గురువారం కోర్టుకు వెళుతుండగా అడ్డుకుని కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో 90 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో ఆమెని చేర్పించగా .. హాస్పిటల్ లో చేరిన ఆమె చికిత్స పొందుతుండగా.. గుండెపోటు రావడంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగానే ..ఉన్నావ్ అత్యాచార బాధితురాలు చనిపోవడం తో దేశం మొత్తం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో మీడియా తో మాట్లాడిన ఉన్నావ్ బాధితురాలి తండ్రి ..మాకు హైదరాబాద్ తరహా న్యాయం కావాలంటూ - నిందుతులని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేసారు.