Begin typing your search above and press return to search.
సీఎం వస్తేనే ఉన్నావ్ బాలిక అంత్యక్రియలు
By: Tupaki Desk | 8 Dec 2019 7:29 AM GMTహైదరాబాద్ లో దిశ ఉదంతం మరిచిపోకముందే ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో బాలికను పెట్రోల్ పోసి కాల్చిచంపేశారు రేపిస్టులు. బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులే బెయిల్ పై బయటకొచ్చి విచారణలో భాగంగా కోర్టుకు వెళుతున్న బాలికపై ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది.
బాలికపై పెట్రోల్ పోసినా ఆమె అగ్ని కీలలతోనే కిలోమీటర్ పరిగెత్తడం.. ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. అయితే చివరకు 90శాతం కాలిన గాయాలతో ఆ బాలిక తనువు చాలించింది.
ఉన్నావ్ లో రేపిస్టుల ఘాతుకాలకు బలైపోయిన బాలిక మృతదేహంతో ఇప్పుడా కుటుంబం పోరుబాట పట్టింది. బాలిక మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించిన తర్వాతే అంతక్రియలు నిర్వహిస్తామని కుటుంబం పోరాటం మొదలుపెట్టింది.
ఇప్పటికే బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. బీజేపీ నాయకుల పరామర్శలను స్థానికులు, బాలిక కుటుంబసభ్యులు అడ్డుకొని వారికి నిరసన తెలుపుతున్నారు. వారిని పరామర్శించడానికి అనుమతించడం లేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని చూసిన తరువాతే అంత్యక్రియలను నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్టే ఉన్నావ్ బాధితురాలి నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఉన్నావ్ బాలికపై పెట్రోల్ పోసి చంపిన నిందితులను అరెస్ట్ చేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని.. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. బాలిక కుటుంబం మాత్రం యోగి చూస్తేనే అంత్యక్రియలు చేస్తామని చెప్పడంతో ఈ వివాదం ఇప్పుడు యూపీలో వేడి పుట్టిస్తోంది.