Begin typing your search above and press return to search.
అనవసరంగా కెలుక్కుంటున్న జగన్ ప్రభుత్వం!?
By: Tupaki Desk | 11 Nov 2021 5:30 AM GMTప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీసు అనే వివాదం దశాబ్దాలుగా కంటిన్యూ అవుతునే ఉంది. ఎందరో ముఖ్యమంత్రులు ఇదే విషయమై అనేక సార్లు సమీక్షలు జరిపారు. ఒకరిద్దరు సీఎంలు ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించారు. అయితే కొందరు వైద్యులు వెంటనే కోర్టుకెళ్లి రక్షణ తీసుకున్నారు. దీంతో దశాబ్దాలుగా ఈ వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి ఈ వివాదం విత్తు ముందా ? చెట్టుముందా ? అనే క్లిష్టమైన ప్రశ్నలాంటిదే.
ప్రభుత్వ వైద్యులుగా ఉన్న వారు ప్రైవేటు ప్రాక్టీసు ఎలా చేస్తారని ప్రభుత్వం నిలదీస్తుంది. తమ డ్యూటీ అయిపోయిన తర్వాత తాము ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటనేది వైద్యుల సమాధానం. రెండు వర్గాల వాదనల్లోను విలువైన పాయింట్లే ఉన్నాయి. అయితే ఇది నైతికతకు సంబంధించిన విషయం కావటంతో సమస్య ఎంతకాలమైనా తెగటం లేదు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ మళ్ళీ ఇదే సమస్యను కెలుక్కుంటోంది.
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించాల్సిందే అని ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రైవేటు ప్రాక్టీసు నిషేధానికి అవసరమైన విధివిధానాలను రూపొందించాలని న్యాయశాఖ ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు. ఇదే విషయమై న్యాయ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో న్యాయ నిపుణులు చర్చలు జరుపుతున్నారు. ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న ప్రభుత్వ వైద్యుల వివరాలను ఇప్పటికే సేకరించింది ప్రభుత్వం. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు వైద్యుల సంఘంతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఇదే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
డాక్టర్లపై ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేషంట్లను తమ క్లినిక్కులకు రావాలని డాక్టర్లు చెబుతున్నారని. ప్రభుత్వాసుపత్రుల్లోనే పనిచేస్తు రోగుల దగ్గర ప్రభుత్వాసుపత్రులనే తక్కువ చేసి మాట్లాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం తమకిస్తున్న మందులను కొందరు డాక్టర్లు తమ సొంత ప్రాక్టీసుకు వాడుకుంటున్నారని కూడా ఆరోపణలున్నాయి. సరే తమపై వచ్చే ఆరోపణలను ఏ డాక్టరు కూడా అంగీకరించరు.
ఇందుకనే ప్రైవేటు ప్రాక్టీసును నిషేధిస్తూ కొత్త డాక్టర్ల అపాయిట్మెంట్లలో నిబంధన పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ప్రైవేటు ప్రాక్టీసు చేయని డాక్టర్లకు అదనంగా అలవెన్సులు, లేదా జీతాల పెంపు అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎన్ని అంశాలను పరిశీలించినా, ఎన్ని నిబంధనలను పెట్టినా ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసును కంట్రోల్ చేయటం సాధ్యం కావటంలేదు. అందుకనే చాలామంది సీఎంలు ఈ సమస్యను అలాగే వదిలేశారు. మరిపుడు జగన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.