Begin typing your search above and press return to search.
కశ్మీర్ పై యూఎన్ వో సంచలనం....
By: Tupaki Desk | 9 Aug 2019 12:01 PM GMTజమ్మూ కశ్మీర్ కు దశాబ్దాలుగా స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో పాకిస్తాన్ తీవ్రంగా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. ప్రపంచదేశాలకు భారత్ పై ఫిర్యాదు చేస్తూ పాక్ తన అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై యూఎన్ వో ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరర్స్ స్పందించారు.
కశ్మీర్ విషయంలో రెండు దేశాల నేతలు, ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ఇది ద్వైపాక్షిక సమస్య అన్న ఆయన సిమ్లా ఒప్పందాన్ని కూడా ఈ సందర్భంగా తెరమీదకు తీసుకువచ్చారు. ఈ విషయంలో ఇరు దేశాలు ఎలాంటి ఆవేశ పూరిత నిర్ణయాలు తీసుకోకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇమ్రాన్ కశ్మీర్ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ భారత్ ను విలన్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కశ్మీర్ లో మిలటరీ దళాలు ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని మిలటరీ దళాలు ఉపసంహరించుకునేలా మోడీ ప్రభుత్వానికి వార్నింగ్ లు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే యూఎన్ వో ప్రధాన కార్యదర్శి స్పందనను ఆయన ప్రతినిధి స్టెఫనీ దుజారిక్ ప్రకటన ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఇరు దేశాలు 1972 సిమ్లా ఒప్పందం మేరకు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ ఒప్పందం కూడా యూన్ వో నిబంధనల మేరకే జరగాలన్నారు. ఇక కశ్మీర్ సమస్య విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని యూఎన్ వో ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఇమ్రాన్ ఖాన్ కు సూచిస్తూనే... భారత్ లో అంతర్భాగంగా ఉన్న కశ్మీర్ లో ఆంక్షలు విధించడం పాక్ కు సరికాదని సూచించింది.
ఇక గురువారం మోడీ ప్రసంగం తర్వాత ఇమ్రాన్ మరింతగా రెచ్చిపోతున్నట్టే కనిపిస్తోంది. భారత ప్రభుత్వం కశ్మీర్ లో ఎన్ని వేల బలగాలను మోహరించినా కశ్మీర్ ప్రజలు ఆజాదీ కోసం చేసే పోరాటం ఆగదని పైగా ఎక్కువ అవుతుందని తెలిపారు. ఇప్పటికే పీవోకే డిజైన్ మార్చి మరీ నిబంధనలు ఉల్లంఘించి మరీ యూఎన్ వోకు కంప్లెంట్ చేయడాన్ని బట్టి చూస్తే పాక్ తీరు దొంగే దొంగ అన్న చందంగా ఉన్నట్లు ఉంది.