Begin typing your search above and press return to search.

27 ఏళ్లుగా అన్‌స్టాపబుల్.. బీజేపీ సక్సెస్ సీక్రెట్ ఏంటి

By:  Tupaki Desk   |   8 Dec 2022 10:30 AM GMT
27 ఏళ్లుగా అన్‌స్టాపబుల్.. బీజేపీ సక్సెస్ సీక్రెట్ ఏంటి
X
1985లో 11.. 1990లో 67.. 1995లో 121.. 1998లో 117.. 2002లో 127.. 2007లో 117.. 2012లో 115.. 2017లో 99.. 2022లో 150+...

ఇదంతా ఏంటో తెలుసుకదా... గుజరాత్‌లో 1985 నుంచి బీజేపీ సాధిస్తున్న సీట్ల సంఖ్య. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో 1985లో కేవలం 11 మాత్రమే గెలిచిన బీజేపీ ఆ తరువాత 1990లో 67 సీట్లకు పెరిగింది.

అనంతరం 1995లో 121 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. 27 ఏళ్లుగా అధికారంలోనే ఉంది.. వరుసగా ఆరు సార్లు అధికారంలో ఉంది... ఇప్పుడు 27 ఏళ్ల తరువాత కూడా వరుసగా ఏడోసారి అధికారంలోకి రాబోతోంది. అది కూడా ఇంతవరకు ఎన్నడూ లేనంత 150కిపైగా స్థానాల్లో విజయం దిశగా సాగుతోంది.

గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అంతా ఊహించారు కానీ ఈస్థాయిలో సీట్లు వస్తాయని మాత్రం ఎవరూ ఊహించకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా ఒక్క పీమార్క్ ఎగ్జిట్ పోల్ మాత్రమే బీజేపీకి 140కి పైగా సీట్లు రావొచ్చని అంచనా వేసింది. మిగతా ఎవరూ 140 సీట్లు దాటి వస్తుందని అంచనా వేయలేదు.

కేంద్రంలో మోదీ అధికారంలో ఉండడం గుజరాత్‌లో బీజేపీకి కలిసొస్తోంది. ఎన్నికలకు ముందు మోర్బీ వంతెన కూలిన ఘటన వంటివి విపక్షాలలో ఆశలు కలిగించినా ఎన్నికల ఫలితాలలో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు.
గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేయడమనేది బీజేపీకి కలిసొచ్చిందని.. కాంగ్రెస్ ఓట్లు చీలి ఆమ్ ఆద్మీకి పడ్డాయని.. ఆ రెండు పార్టీల మధ్య ఓట్ల చీలిక బీజేపీకి లాభించిందనే లెక్కలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే... బీజేపీ నిర్మించిన బలమైన వ్యవస్థే ఆ పార్టీ అన్ని సీట్లు సాధించడానికి కారణమని.. ఆప్ కాంగ్రెస్ ఓట్లు చీల్చలేదని.. ఆప్ బరిలో లేకున్నా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న విశ్లేషణలూ ఉన్నాయి.
మొత్తానికి గుజరాత్‌లో భారీ సంఖ్యలో సీట్లు సాధిస్తుండడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో ఊపు కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.