Begin typing your search above and press return to search.

యోగిని షేక్ చేసి.. చతికిలపడిన ఐపీఎస్

By:  Tupaki Desk   |   30 Jan 2019 10:38 AM GMT
యోగిని షేక్ చేసి.. చతికిలపడిన ఐపీఎస్
X
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడవుతాయి అనే సామెత ఐపీఎస్ అధికారి జస్వీర్ సింగ్ కు కరెక్ట్ గా సరిపోతుంది. 16ఏళ్ల కిందట ఓ కేసులో ఇరుక్కొని బెయిల్ కోసం కాళ్లబేరానికి వచ్చిన యోగీ ఆదిత్య నాథ్ ప్రస్తుతం మిస్టర్ క్లీన్ గా పేరు సంపాదించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ప్రజలను పాలిస్తున్నాడు. కాగా నాలుగో సింహం అంటూ కాలరేగిసిన ఈ ఐపీఎస్ అధికారికి మాత్రం చెప్పుకోదగిన పని మాత్రం లేదు.

2002లో జస్వీర్ సింగ్ ఏస్పీగా ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్లో డ్యూటీలో చేరారు. అప్పుడు అతని వయస్సు 34 సంవత్సరాలు. వచ్చిరాగానే గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్యానాథ్(ప్రస్తుత ముఖ్యమంత్రి) మీద ఉన్న పెండింగ్ కేసుల తిరుగదోడే ప్రయత్నం చేశాడు. ఓ కేసులో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద యోగిని నిందితుడిగా చేర్చి నాలుగో సింహం అంటూ కాలరేగిరేశాడు. అప్పట్లో ఆయనపై కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చినా కేసు వాపసు తీసుకోలేదు. దీంతో రెండురోజుల్లోనే ఆయన ఫుడ్ డిపార్ట్ మెంట్ కు ట్రాన్స్ ఫార్మర్ కావాల్సి వచ్చింది.

అయినప్పటికీ జస్వీర్ సింగ్ లో మార్పురాలేదు. మరో ఏడాదికి లక్ష్మీపూర్ భేరి ఫుడ్ స్కామ్ కి సంబంధించి ములాయం క్యాబినేట్ లోని ఆహార మంత్రి రాజా భయ్యాపై అవినీతి కేసు నమోదు చేశాడు. దీంతో అక్కడి నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యాడు. ఇలా మొత్తం 26ఏళ్ల ఐపీఎస్ కేరీర్ లో 20ఏళ్ల పాటు ప్రాధాన్యం లేని పోస్టులతో కాలం వెళ్లదీస్తూ వస్తున్నాడు.

ప్రస్తుతం జస్వీర్ సింగ్ లక్నోలోని రూల్స్ అండ్ మాన్యువల్స్ డిపార్ట్ మెంట్లో ఏడీజీ పోస్టులో ఉన్నారు. ‘‘రోజు ఒక స్కూల్ పిల్లాడిగా లంచ్ బ్యాక్స్ పట్టుకొని ఆఫీసు వెళతా.. అక్కడ నాకొక రూమ్ ఉంది. అందులో తాను కొనుక్కున్న 40 పుస్తకాలను చదువుకుంటూ సాయంత్రం దాకా గడిపేస్తా.. తిరిగి ఇంటికి వెళ్లిపోతా.. అక్కడ పని చేయడానికి ఏం లేదు’’ అంటూ మీడియా ఎదుటే పలుమార్లు వాపోయాడు జస్వీర్ సింగ్.

జస్వీర్ సింగ్ ను ఆయన కొలీగ్స్ - సీనియర్లు ఒక ట్రబుల్ మేకర్ గానే చూసేవాల్లు. అయినా ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ప్రజలకు జవాబుదారీగా వ్యహరించడమే అసలైన డ్యూటీ అనే నమ్మకంపై నడిచేవాడు. ఏదిఏమైనా రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటేనే మనల్ని ఉండనిస్తారు లేదంటూ ఇలా కోరలు పీకి వానపాములా మారుస్తారనడానికి తానే ఉదాహరణ అని చెబుతున్నాడు. ఏదో సాధిద్దామని ఐపీఎస్ లో చేరి ఏమి సాధించలేకపోయానని జస్వీర్ సింగ్ వాపోతున్నారు.. జస్వీర్ సింగ్ ఏపిసోడ్ మాత్రం ప్రస్తుతం రాజకీయ-ఖాకీ వ్యవస్థల పనితీరుకు నిలువెత్తు నిదర్శనంగా కనబడుతోంది..