Begin typing your search above and press return to search.
యూపీ ఎలక్షన్: అక్కడైనా కాంగ్రెస్‌కు పరువు దక్కేనా?
By: Tupaki Desk | 9 Feb 2022 9:30 AM GMTఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల వేడి భగ్గుమంటోంది. గురువారం తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవడం అటుంచి కంచుకోటగా భావించే రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోని అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లను అయినా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకోగలదా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఎందుకంటే.. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కంచుకోట. దీంతో ఇక్కడైనా.. కాంగ్రెస్ పరువు నిలబెట్టుకుంటుందా? లేదా? అనే చర్చ సాగుతోంది.
గతంలో అమేఠీలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ ఇప్పుడు బీజేపీ అమలు చేస్తోంది. 2024లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయదలిస్తే.. ఆమె రాయ్‌బరేలీకి బదులు మరో సురక్షిత స్థానాన్ని ఎంచుకోక తప్పదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌కు వెళ్లినట్లుగానే సోనియాగాంధీ మరో రాష్ట్రం నుంచి పోటీ చేయాల్సి రావచ్చునని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అంటే.. ఇక్కడ కూడా కాంగ్రెస్ కుప్పకూలడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీల హయాం నుంచి కాంగ్రెస్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న రెండు కంచుకోటలు..రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ నియోజకవర్గాలు. ఈ రెండు సెగ్మెంట్ల పరిధిలో 10 శాసనసభ నియోజకవర్గాలుంటే..2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో... రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగలిగారు. అవి కూడా రాయ్‌బరేలీ పరిధిలోవే. అప్పటికి రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి సోనియా గాంధీ, అమేఠీ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో... అమేఠీలో స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మిగిలిన లోక్‌సభ స్థానం రాయ్‌బరేలీ ఒక్కటే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే అయిదు శాసనసభ సీట్లనూ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. 2017లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మను రాయ్‌బరేలీ ఇన్‌ఛార్జిగా నియమించింది. కేంద్ర మంత్రి స్మృతీఇరానీ కూడా అమేఠీ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రాయ్‌బరేలీకీ వచ్చి వెళుతున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ దినేశ్‌సింగ్‌ను 2018లో పార్టీలో చేర్చుకొన్న బీజేపీ.. 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియాపైనే పోటీకి దించింది. కాంగ్రెస్ తరఫున 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అదితి సింగ్, రాకేశ్ సింగ్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థులుగా అవే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. నాయకులతో పాటు సొంత ఎమ్మెల్యేలూ ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు బోసిపోతున్నాయి. పార్టీకి పెద్ద దిక్కుగాఉండాల్సిన నేతలూ ముఖం చాటేస్తున్నారు. యూపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్, రాజ్యసభ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ, సీనియర్ దళిత నేత పి.ఎల్.పునియా తదితరులు కాంగ్రెస్ ప్రచార సభల్లో కనిపించడంలేదు.
టికెట్లు పొందినవారు కూడా ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు. గోండాలో టికెట్ కేటాయించిన సవితాపాండే బీజేపీలోకి, బరేలీలో.. సుప్రియ అరోన్ సమాజ్‌వాదీలోకి, రాంపుర్‌లో.. హైదర్‌అలీ ఖాన్ అప్నాదళ్‌లోకి, సహరాన్‌పుర్‌లో.. మసూద్ అక్తర్ సమాజ్‌వాదీలోకి జారుకున్నారు. ప్రియాంకా గాంధీ యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతోంది. పార్టీ శ్రేణులను కొంత వరకు కూడ గట్టినా వారికి ధైర్యాన్ని మాత్రం కల్పించలేకపోతున్నారు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోనైనా కుటుంబం పట్టును కాపాడుకోవడం కష్టమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియానే స్వయంగా రంగంలోకి దిగుతారనే వాదన వస్తోంది.