Begin typing your search above and press return to search.
యూపీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే..
By: Tupaki Desk | 30 Dec 2021 9:30 AM GMTఒకటి దేశ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశమైతే.. రెండోది తెలుగు సినీ పరిశ్రమ తదుపరి ప్రస్థానం లెక్క ఎలా ఉండనుందన్న విషయాన్ని తేలుస్తుంది. దేనికది చూస్తే.. రెండు ముఖ్యమే. ఈ రెండు అంశాల మీదా రాష్ట్రాలకు అతీతంగా దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు ఒక పక్క.. మరోవైపున రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో.. జనవరి 7న విడుదల కావాల్సిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విడుదలవుతుందా? ఫిబ్రవరి చివర్లో కానీ.. మార్చి మొదట్లో కానీ జరగాల్సిన యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? అన్న ప్రశ్న అందరిని తొలిచేస్తుంది.
ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుకోవటమే కానీ.. ఈ రెండు అంశాల మీద క్లియర్ కట్ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ కొరతను తీరుస్తూ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చేసింది. యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని.. అందులో మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయొద్దని రాజకీయ పార్టీలన్ని కోరాయని.. తాము అన్ని పార్టీలతో సమావేశమైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే యూపీ అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తాము ఎన్నికల్ని నిర్వహిస్తామని.. ఈసారి ఎన్నికల సందర్భంగా 11 వేల పోలింగ్ కేంద్రాల్ని.. 800 మహిళా పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో ఫిబ్రవరి - మార్చిలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు యథావిధిగా జరుగుతాయన్న స్పష్టత వచ్చినట్లే.
ఇక.. మరో ఎనిమిది రోజుల్లో విడుదల కావాల్సి ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం రిలీజ్ అవుతుందా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య.. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నియంత్రణల నేపథ్యంలో అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేస్తారా? లేదంటే షాకింగ్ నిర్ణయం తీసుకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో జక్కన్న కాస్తంత పెద్ద మనసు చేసుకొని కాస్తంత క్లారిటీ ఇస్తే.. సినీ ప్రియుల్ని వేధిస్తున్న టెన్షన్ నుంచి విముక్తి కలిగిస్తే బాగుంటుందేమో?