Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నికలు: నిరుద్యోగులకు గాలం వేస్తున్న కాంగ్రెస్

By:  Tupaki Desk   |   21 Jan 2022 9:17 AM GMT
యూపీ ఎన్నికలు: నిరుద్యోగులకు గాలం వేస్తున్న కాంగ్రెస్
X
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా అక్కడ నిరుద్యోగులకు గాలం వేస్తోంది. తాజాగా ‘యూత్ మేనిఫెస్టో’ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

ఆ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా శుక్రవారం రిక్రూట్ మెంట్ చట్టాన్ని విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు, యువతపై కాంగ్రెస్ భారీ ఎత్తున ఫోకస్ చేసింది.


మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు.

యూపీ యువతకు ఉపాధి కల్పించడమే తమ పార్టీ యూత్ మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఉత్తరప్రదేశ్ యువకులు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే అంశాన్ని ఈ మేనిఫెస్టోలో కోడ్ చేవామన్నారు. ఈ మేనిఫెస్టోను తయారు చేసేందుకు పార్టీ యూపీ యువతతో మాట్లాడి వారి ఆకాంక్షలను అందులో పొందుపరిచినట్లుగా వెల్లడించారు.


దేశంలోని యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారని.. అయితే ఏం జరుగుతుందో మీకు తెలుసునంటూ విమర్శించారు. యూపీ యువతతో మాట్లాడి రూపొందించిన మేనిఫెస్టో ఇదని ప్రియాంక అన్నారు.

ఇందుకోసం మా బృందం మొత్తం రాష్ట్ర యువతతో మాట్లాడింది. అందుకే దీన్ని రిక్రూట్ మెంట్ లెజిస్లేషన్ అంటున్నామని వెల్లడించారు.


ఎందుకంటే అతిపెద్ద సమస్య రిక్రూట్ మెంట్.. రాబోయే రోజుల్లో 20 లక్షలమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. యువతలో ఉత్సాహం వీగిపోయిందన్నారు.యువతలో విశ్వాసాన్ని నింపడం.. ఉపాధి కల్పించడంలో వారికి ఎలా సహాయం చేస్తామో హామీ ఇవ్వాలనుకుంటున్నామన్నారు.


పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1.5 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సెకండరీ, ఉన్నత విద్య, పోలీసు తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు.


పరీక్షల క్యాలెండర్ విడుదల చేస్తామని.. రిక్రూట్ మెంట్ ప్రకటన, పరీక్ష, నియామక తేదీలను నమోదు చేస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు కొత్త అవకాశాలు కల్పిస్తామన్నారు.


ప్రపంచ స్థాయి సంస్థలను ఏర్పాటు చేసి అందులో శిక్షణ ఇస్తామన్నారు. కమ్యూనిటీ యువతకు 1శాతం వడ్డీకి రుణం ఇస్తామన్నారు.యువతను డ్రగ్స్ ఉచ్చు నుంచి బయటపడడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.యువతకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.

మొత్తంగా యువతను ఆకర్షించేలానే కొత్త మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇది యూపీ యువతను ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది వేచిచూడాలి.