Begin typing your search above and press return to search.

అచ్చు ఐటీ కంపెనీ సీఈవోలా వ్య‌వ‌హ‌రిస్తోన్న సీఎం!

By:  Tupaki Desk   |   5 July 2019 6:27 AM GMT
అచ్చు ఐటీ కంపెనీ సీఈవోలా వ్య‌వ‌హ‌రిస్తోన్న సీఎం!
X
మిగిలిన కంపెనీల‌కు ఐటీ కంపెనీల‌కు ఒక తేడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటుంది. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు నెత్తిన పెట్టుకోవ‌టం.. ఇంటి అల్లుడి కంటే ఎక్కువ మ‌ర్యాద‌లు ఎంత‌లా చేస్తారో.. అవ‌స‌రం లేన‌ప్పుడు అంతే క‌టువుగా ఏ మాత్రం వెనుకా ముందు చూడ‌కుండా పింక్ స్లిప్పులు ఇచ్చేయ‌టం క‌నిపిస్తుంది.
మిగిలిన రంగాల్లో మాదిరే.. స‌ర్లే.. ఉద్యోగం ఎందుకు తీయ‌టం.. క‌డుపు కొట్టిన‌ట్లు అవుతుంద‌న్న ఫీలింగ్ ఐటీ కంపెనీల్లో అస్స‌లు క‌నిపించ‌వు. ఇప్పుడు ఇదే తీరులో వ్య‌వ‌హ‌రిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో ప‌ని తీరు ఆశించినంత‌గా లేకుంటే నిర్మోహ‌మాటంగా పింక్ స్లిప్పులు ఇచ్చేసే తీరు అంతకంత‌కూ ఎక్కువ అవుతోంది.

తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ వెలువ‌రించిన రిపోర్ట్ ప్ర‌కారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తీరు బ‌హు చిత్రంగా ఉందంటున్నారు. ప‌ని తీరు బాగాలేని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ.. పింక్ స్లిప్పులు ఇప్పిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. ఒక అంచ‌నా ప్ర‌కారం యూపీకి చెందిన 29 ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు సంబంధించిన 201 మంది ఉద్యోగుల‌కు పింక్ స్లిప్పులు జారీ చేసింది యోగి స‌ర్కారు.

ఇలా పింక్ స్లిప్పులు అందుకున్న వారిలో ఎక్కువ‌మంది ఫిఫ్టీ ప్ల‌స్ అయిన వారే ఉండ‌టం గ‌మ‌నార్హం. వ‌య‌సు కంటే ప‌ని తీరు ఆధారంగానే వారిని ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ట్లుగా చెబుతున్నారు. పింక్ స్లిప్పు అందుకున్న వారిలో క్లాస్ వ‌న్ ఉద్యోగులు ప‌లువురు ఉండ‌టం విశేషం. ప‌ని తీరు స‌రిగా లేని వారు.. అవినీతి మ‌ర‌క‌లున్న ఉద్యోగుల‌కు బ‌ల‌వంతంగా ఇంటికి పంపించేస్తూ యోగి కొర‌డా ఝుళిపిస్తున్నారు.

అంతేకాదు.. ఉద్యోగం స‌రిగా చేయ‌ని వారిపై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేస్తామంటు ఆయ‌న ఇస్తున్న వార్నింగ్ ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు త‌డారిపోతోంది. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన వారికి జైలుకు పంపేందుకు సైతం తాను వెనుకాడ‌న‌ని స్ప‌ష్టం చేస్తున్న యోగి.. బాగా ప‌ని చేసే వారికి రివార్డులు కూడా ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పి కొత్త ఆశ‌ల్ని పెంచుతున్నారు. ప‌ని చేయ‌ని వారిపై వేటు వేస్తూ.. బాగా ప‌ని చేసిన వారికి రివార్డులు ఇస్తే.. ఇష్యూ బ్యాలెన్స్ కావ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో ప‌ని సంస్కృతి పెరుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఐటీ కంపెనీ సీఈవోలా వ్య‌వ‌హ‌రిస్తున్న యోగికి రానున్న రోజుల్లో ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌వుతాయో చూడాలి.