Begin typing your search above and press return to search.
ఈ పీనాసితనం ఏంది యోగి?
By: Tupaki Desk | 9 July 2020 4:14 AM GMTఒక డీఎస్పీ స్థాయి పోలీసు అధికారితో సహా మొత్తం ఎనిమిది మంది పోలీసుల్ని పిట్టల్ని కాల్చినట్లుగా కాల్చిపారేసిన ఒక గ్యాంగస్టర్ ను అదుపులోకి తీసుకోవటానికి రోజుల తరబడి సమయం తీసుకుంటుందా? అన్నది ప్రశ్న. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వికాస్ దూబే ఆరాచకంపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఇంతకు ముందెప్పుడు జరగని రీతిలో.. ఒక గ్యాంగస్టర్ పోలీసు అధికారుల్ని.. పోలీసులపై కాల్పులు జరిపి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగేలా చోటు చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది.
అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని రంగంలోకి దింపింది. పోలీసులు ఎంతగా వెతుకుతున్నా.. అతడి ఆచూకీ మాత్రం లభించటం లేదు. ప్రజాప్రతినిధులతోనూ.. పోలీసుల్లోనూ మంచి పలుకుబడి ఉన్న వికాస్ లాంటోడ్ని అదుపులోకి తీసుకోవటం అంత తేలికైన విషయం కాదన్న విషయం గడిచినకొన్ని రోజుల్లోచోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది.
మంగళవారం రాత్రి హర్యానాలోని ఒక హోటల్ లో ఉన్నట్లుగా పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులకు ఝులక్ ఇస్తూ తప్పించుకున్న వైనం తెలిసిందే. ఎనిమిది పోలీసుల్ని కాల్చివేసిన ఉదంతం తర్వాత వికాస్ దూబే కు సంబంధించిన సమాచారం తెలిపిన వారికి రూ.2.5లక్షల రివార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎంత ప్రయత్నించినా అతడి ఆచూకీ లభించని నేపథ్యంలో అతడి తలపై ఉన్న రివార్డును రూ.5లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఒక ఆరాచవాదిని పట్టుకోవాల్సి వచ్చినప్పుడు రివార్డు మొత్తాన్ని భారీగా పెంచేస్తే.. సమాచారం తన్నుకుంటూ రావటం ఖాయం. కానీ.. ప్రభుత్వం మాత్రం పీనాసితనాన్ని వదిలిపెట్టకుండా రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచే కన్నా.. రూ.25 లక్షలో..రూ.50లక్షల రివార్డు ప్రకటిస్తే.. వివరాలు ఇట్టే వచ్చేస్తాయన్న విషయం యూపీ సీఎం యోగి మాష్టారికి ఎందుకు అర్థం కానట్లు..?