Begin typing your search above and press return to search.
వారి తాట తీసేలా యోగి సర్కారు సరికొత్త నిర్ణయం
By: Tupaki Desk | 24 Sep 2022 4:29 AM GMTదేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అన్నంతనే నేరాలు.. ఘోరాలు గుర్తుకు వస్తుంటాయి. ఇవి సరిపోనట్లు ఇటీవల కాలంలో అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
వీటిని కంట్రోల్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా.. ఆ నేరాలకు పుల్ స్టాప్ పడని పరిస్థితి. ఇలాంటివేళలోనే యోగి సర్కారు మరో సంచలన నిర్ణయాన్నితీసుకుంది.
కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (యూపీ సవరణ) బిల్లు 2022ను ఆ రాష్ట్ర అసెంబ్లీ తన ఆమోదాన్ని తెలిపింది. దీంతో.. అత్యాచారాలు లాంటి దారుణ నేరాలకు చెక్ పెట్టేందుకు వీలుగా తాజా బిల్లు ఉపకరిస్తుందని చెబుతున్నారు.
ప్రస్తుతం చట్ట సభ ఆమోదం పొందిన ఈ బిల్లులోని కీలక అంశం ఏమంటే.. అత్యాచారాలకు పాల్పడే వారికి యాంటిసిపేటరీ బెయిల్ దొరకపోవటమే కాదు.. వారిపై పోక్సో యాక్టు కింద బుక్ చేయనున్నారు.
గురువారం సభలో ప్రవేశ పెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం చర్చ జరిగింది. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ఆ బిల్లుకు ఓకే చెబుతూ తన అంగీకారాన్ని తెలిపింది. 25 కోట్లకు పైనే ప్రజలున్న యూపీలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మహిళలపై అత్యాచారాల పర్వాలు మాత్రం ఆగని పరిస్థితి.
ఇలాంటి వేళ.. ఈ చట్టాల్ని మరింత కఠినం చేయటానికి వీలుగా తాజా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టినట్లుగా చెబుతున్నారు. కొత్త చట్టం అందుబాటులోకి వచ్చిన వేళలో అయినా యూపీలో అత్యాచార ఉదంతాలకు చెక్ పడుతుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.