Begin typing your search above and press return to search.
అంబేద్కర్ విషయంలో యోగీ సంచలనం..?!
By: Tupaki Desk | 20 May 2018 9:45 AM GMTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే..కేవలం తన రాష్ర్టానికి అందులోనూ ఓ పురపాలికకు మాత్రమే పరిమితం అయ్యే నిర్ణయం ఆయన తీసుకున్నప్పటికీ...అది దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసే ప్రమాదం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇంతకీ యూపీ ప్రభుత్వం తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం ఏంటంటే...ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం. అక్కడితోనే ఆగిపోకుండా..ఆ స్థానంలో బీజేపీ గౌరవించే దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహం ఏర్పాటు చేయడం. యోగీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
మరిన్ని వివరాల్లోకి వెళితే ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ప్రస్తుతం రెండు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకదాని స్థానంలో దీన్ దయాల్ విగ్రహం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. దీంతో యోగి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఆగ్రా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్‌కు యూపీ సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. అంబేద్కర్ విగ్రహం స్థానంలో దీన్‌దయాల్ విగ్రహం పెట్టే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఆగ్రా ఎస్పీని కూడా ఆదేశించారు. ఇది దళితులను అవమానించడం కాదు. దీన్‌దయాల్ దళితుల హక్కుల కోసం ఎంతగానో పోరాడారు. అయినా ఏఎంసీ ఆవరణలో రెండు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఒక దానిని తీసి మరోచోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ స్థానంలో పండిత్ దీన్‌దయాల్ విగ్రహం పెట్టాలి అని ప్రసాద్ గార్గ్ అన్నారు.
కాగా ఈ పరిణామంపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఆగ్రా స్థానిక సంస్థలో 90 శాతానికిపైగా ఉద్యోగులు దళితులు కాగా.. 100 మంది కౌన్సిలర్లలో 24 మంది దళితులే ఉన్నారు. వీళ్లంతా అంబేద్కర్ విగ్రహం తొలగిస్తే వీధుల్లోకి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. ఆ విగ్రహాన్ని తొలగించి బీజేపీకి ఓ దిగ్గజ నేత విగ్రహం ఏర్పాటు చేయడమే తీవ్రంగా రెచ్చగొట్టడమే అవుతుంది అని రతన్‌పుర కౌన్సిలర్ ధరమ్‌వీర్ సింగ్ అన్నారు. మరోవైపు ఈ వార్త మీడియాలో ప్రసారం కావడంతో ఇప్పటికే నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. త్వరలోనే వాళ్లు ఆందోళన రూపం పడతారనే అంచనాలను సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు.