Begin typing your search above and press return to search.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి : AIMIM నేత

By:  Tupaki Desk   |   11 Jun 2020 1:30 PM GMT
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి : AIMIM నేత
X
గోవధ నియంత్రణ పై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ కు ఆమోదం తెలిపిన క్రమంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఏఐఎంఐఎం నేత సయ్యద్‌ అసీం వకార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోమాతను కాపాడేలా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఓ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. పాలు ఇవ్వని ఆవులను అమ్మేవారిని కూడా కఠినంగా శిక్షించి రూ 20 లక్షల జరిమానా విధించాలని అన్నారు. ఆవులపై సరైన వ్యూహం అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు.

గోహత్యకు పాల్పడిన వారికి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని యోగీ సర్కార్ గోవధ నివారణ చట్టం 2020 పేరుతో కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఒక రోజు తేడా లోనే ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆవులు వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్‌ పదార్ధాలను తింటూ, డ్రైన్‌ల నుంచి నీటిని తాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా గో రక్షణ, గోవధ నియంత్రణ కోసం యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం గోవథకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ 5 లక్షల వరకూ జరిమానా విధిస్తారు.