Begin typing your search above and press return to search.
హిజ్రాతో ప్రేమ.. మూడు ముళ్లు.. ఏడడుగులు కూడా!
By: Tupaki Desk | 11 Dec 2022 12:30 AM GMTసమాజంలో హిజ్రా అంటే.. పెద్దగా ఎవరూ ఆదరించరనే మాట ఉంది. నపుంశకులుగా వారిపై ముద్ర కూడా పడింది. ఏదైనా శుభకార్యాలకు వారిని పిలిచి.. ఏదో నాలుగు స్టెప్పులు వేయించి.. కొంత పారితోషికం చేతిలో పెట్టి.. సాగనంపడం వరకే పరిమితం. అయితే... హిజ్రాను ప్రేమించడం ఎక్కడైనా విన్నారా? ప్రేమే కాదు.. ఏకంగా మూడుముళ్లు, ఏడడుగులతో జీవిత భాగస్వామిగా కూడా స్వీకరించాడు ఓ యువకుడు.
ఉత్తర్ప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాకు చెందిన వీరూ రాజ్‌భర్(24) అనే యువకుడికి ఓ హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ఎంతగా అంటే.. ఏకంగా పెళ్లి చేసుకునేంతగా! ఇద్దరూ దాదాపు రెండేళ్లకు పైగానే ప్రేమించుకున్నారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. చివరకు రాజ్.. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ముందు ఆమె ఆశ్చర్యపోయినా.. తర్వాత ఒప్పుకొంది.
పరిచయం.. ఎలా జరిగిందంటే.. పశ్చిమ బంగాల్‌లోని జల్‌పైగురి నివాసి అయిన ముస్కాన్ కిన్నార్ అనే హిజ్రా 2 ఏళ్ల క్రితం బ్రాస్ బ్యాండ్ పార్టీలో డాన్స్ చేయడానికి మౌ ప్రాంతానికి వచ్చింది.
అక్కడ ముస్కాన్.. మౌలోని టెకై గ్రామానికి చెందిన వీరూ రాజ్‌భర్‌ను కలిసింది. వారి మొదటి మీటింగ్లోనే ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరూ లివ్ఇన్ రిలేషన్ షిప్లో ఉండేందుకు నిర్ణయించుకుని.. దాదాపు రెండేళ్లుగా కలిసి ఉన్నారు.
ఇక, తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారు. చిత్రం ఏంటంటే.. ఇరు కుటుంబాలు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం. అంతేకాదు.. తాజాగా వారిరువురికీ జిల్లాలోని భైరోధం ఆలయ ప్రాంగణంలో, హిందూ ఆచారాల ప్రకారం వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిపించారు.
అంతేకాదు, దాదాపు వెయ్యి మందిని షడ్రశోపేతమైన విందును కూడా ఇచ్చారు. ఇది చూసిన వారు, విన్నవారు.. ఎంత ఘాటు ప్రేమయో.. అని కూనిరాగాలు తీస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.