Begin typing your search above and press return to search.

పాక్ క్రికెటర్ కి భారత పౌరసత్వం ఆఫర్ చేసిన బీజేపీ!

By:  Tupaki Desk   |   28 Dec 2019 2:51 PM GMT
పాక్ క్రికెటర్ కి భారత పౌరసత్వం ఆఫర్ చేసిన బీజేపీ!
X
ఇదేంటి పాక్ క్రికెటర్ కి ఇండియా పౌరసత్వం ఏంటి అనుకుంటున్నారా ..నిజమే ఆ క్రికెటర్ కనుక మన దేశానికీ రావాలి అనుకుంటే రావచ్చు అని - అతనికి భారత పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధం అని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. అయితే అసలు పాక్ క్రికెటర్ భారత పౌరసత్వం ఎందుకు కోరుకుంటాడు అంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో చూద్దాం ..

పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జ‌ట్టుకు కొందరు హిందువులు కూడా ప్రాతినిధ్యం వహించారు. అసలు పాక్ జాతీయ జ‌ట్టుకు ఒక హిందువు ప్రాతినిధ్యం వ‌హించ‌డ‌మే అతి పెద్ద వింతే అని చెప్పాలి. ఆలా పాక్ జట్టుకి ప్రాతినిధ్యం వ‌హించిన రెండో హిందూ ఆట‌గాడు దానిష్ క‌నేరియా. ఇతను పాకిస్తాన్ త‌ర‌ఫున 60కి పైగా టెస్టులు ఆడి 260కి పైగా వికెట్లు తీశాడు ఈ స్పిన్న‌ర్. ఒక హిందువు అయ్యి ఉండి, అన్ని టెస్టుల‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం అంటే మాట‌లు కాదు. ఇంజమామ్ కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్ లు ఆడాడు క‌నేరియా. అయితే జాతీయ జ‌ట్టులో స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు క‌నేరియాను బాగా అవ‌మానించార‌నే విష‌యం ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒకప్పటి పాక్ స్టార్ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టాడు. కేవ‌లం హిందూ అనే ఒకే ఒక కార‌ణం చేత క‌నేరియా పై ఇతర ఆటగాళ్లు కొంచెం దురుసుగా ప్రవర్తించేవారని అక్త‌ర్ ప్ర‌క‌టించాడు. ఈ విషయం ఇప్పుడు పెద్ద చర్చలకు దారితీస్తుంది.

అక్త‌ర్ బ‌య‌ట‌పెట్టిన ఈ విష‌యంపై క‌నేరియా స్పందించాడు. త‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికిన అక్త‌ర్ కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. మ‌రి కొంద‌రు ఆట‌గాళ్లు కూడా అప్ప‌ట్లో త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని, కొంద‌రు మాత్రం అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టుగా ఈ పాక్ మాజీ క్రికెట‌ర్ చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన త‌ర్వాత క‌నేరియా ఇంగ్లండ్ వెళ్లి కౌంటీలు - క్ల‌బ్ ల‌కు ఆడుకుంటున్నాడు. అయితే అక్క‌డ ఫిక్సింగ్ వివాదంలో క‌నేరియా చిక్కుకున్నాడు. త‌న‌కు పాక్ నుంచి సపోర్ట్ కావాల‌ని - ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ను కూడా స‌హాయం అర్థించాడు క‌నేరియా. మ‌రోవైపు ఇండియాలో సీఏఏ పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ క‌నేరియా వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పాక్ నుంచి వ‌చ్చే హిందువుల‌కు భార‌త పౌర‌స‌త్వాన్ని ఆఫ‌ర్ చేస్తోంది సీఏఏ చ‌ట్టం. ఈ నేపథ్యంలోనే కనేరియా కోరుకుంటే భారత పౌరసత్వం ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు