Begin typing your search above and press return to search.
కరోనాతో యూపీ మంత్రి మృతి
By: Tupaki Desk | 2 Aug 2020 8:30 AM GMTకరోనా మహమ్మారి తీవ్రత దేశంలో పెరుగుతూనే ఉంది. సామాన్యులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ్వరినీ వదలడం లేదు. అయితే ఇన్నాళ్లు వ్యాధి సోకిన కోలుకోవడం చూశాం.. కానీ ఇప్పుడు ఆ వైరస్ కబళిస్తూ ప్రాణాలు తీస్తుండడం కలవరపెడుతోంది.
ఏపీలో మాజీ మంత్రి మాణిక్యాలరావు మరణం మరిచిపోకముందే.. కరోనాతో తాజాగా యూపీ మంత్రి కమలా రాణి (62) ప్రాణాలు కోల్పోయారు.
కరోనా బారిన పడ్డ యూపీ మంత్రి కమలారాణిని గత నెల 18న చికిత్స కోసం లక్నోలోని రాజధాని కోవిడ్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించింది.
ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. మంత్రి మృతితో అయోధ్య పర్యటనను సీఎం యోగి రద్దు చేసుకున్నారు.