Begin typing your search above and press return to search.
నా భర్త నన్ను కొడతారు.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 25 Jan 2022 8:28 AM GMTమంత్రులకే రక్షణ లేకపోతే ఇక ప్రజలకు ఎలా ఉంటుంది. యూపీలో పరిస్థితిలా ఉంటుంది. సొంత భర్తే తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. శారీరకంగా వేధిస్తున్నాడని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మహిళా మంత్రి వాపోవడం సంచలనమైంది. ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు మంత్రి స్వాతి సింగ్. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి చెందిన మహిళా మంత్రి స్వాతి సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె భర్త తనను కొడతారంటూ ఓ వ్యక్తితో మంత్రి స్వాతి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
2017లో సరోజినీ నగర్ అసెంబ్లీ సీటు నెగ్గి ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్వాతిసింగ్ ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె ఫోన్ సంభాషణ యూపీలో తెగ వైరల్ అవుతోంది.
తన భర్త దయాసింగ్.. శారీరకంగా వేధించాడంటూ స్వాతి ఓ వ్యక్తితో ఫోన్ లో చెప్పారు. చాలా సార్లు తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. దాడి చేశారని ఆరోపించారు.
అయితే ఈ విషయాన్ని ఎక్కడా చర్చించవద్దని ఫోన్ లో స్వాతి సింగ్ కోరారు. దురదృష్టవశాత్తూ ఈ ఆడియో లీకైంది. దీంతో మహిళా మంత్రి మరోసారి వార్తల్లో నిలిచారు.
2016లో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై స్వాతి సింగ్ భర్త దయాసింగ్ అసభ్యకర వ్యాక్యలు చేసి వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు. అనంతరం నసీముద్దిన్ సిద్దిఖీ ఆధ్వర్యంలో బీఎస్పీ నేతలు ధర్నాకు దిగారు. స్వాతిసింగ్, ఆమె కూతురుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో స్వాతి సింగ్ అప్పట్లో వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం దయాశంకర్ కూడా ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారని.. టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం.