Begin typing your search above and press return to search.

త‌లాక్ చెప్పిన భ‌ర్త‌కు రూ.2 ల‌క్ష‌ల జ‌రిమానా

By:  Tupaki Desk   |   13 Jun 2017 8:35 AM GMT
త‌లాక్ చెప్పిన భ‌ర్త‌కు రూ.2 ల‌క్ష‌ల జ‌రిమానా
X
త‌న ఇష్టానుసారంగా ఒకేసారి వరుస‌గా ట్రిపుల్ త‌లాక్ చెప్పిన భ‌ర్త‌కు మ‌త పెద్ద‌లు షాక్ ఇచ్చారు. ఏకంగా అత‌డికి రూ.2 లక్షలు జరిమానా విధించారు. ఈ ఆస‌క్తిక‌రమైన ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని సంభాల్ జిల్లాలో జ‌రిగింది. తలాక్ చెప్పిన వ్యక్తికి జరిమానా విధించడం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

యూపీలోని రాయ్‌ సరి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కి, 22 ఏళ్ల మహిళకు 10 రోజుల క్రితం వివాహం జ‌రిగింది. ఓ విష‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో, ఆ ప్ర‌బుద్ధుడు మ‌రేం ఆలోచించ‌కుండా త‌న భార్య‌కు మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. త‌క్ష‌ణ‌మే భార్యను ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులు న్యాయం కోసం స్థానిక తుర్క్‌ పంచాయత్‌ ను ఆశ్రయించారు.

అక్క‌డి మదర్సాలో నిర్వహించిన తుర్క్ పంచాయత్‌ కు 52 గ్రామాలకు చెందిన సభ్యులు హాజర‌య్యారు.చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ వెలువ‌డ‌ని తీర్పు చెప్పారు. భార్యకు తలాక్ చెప్పిన స‌ద‌రు భర్తకు రూ.2 లక్షల జరిమానా విధించారు. అంతేకాదు, దానిని వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అలాగే భరణం కింద బాధిత మహిళకు రూ.60 వేలు చెల్లించాలని, తీసుకున్న కట్నాన్ని తిరిగి ఇచ్చేయాలని పంచాయతీ ఆదేశించ‌డం కొస‌మెరుపు.

పంచాయతీ సభ్యుల నిర్ణయాన్ని ఆల్ ఇండియా ముస్లిం విమెన్స్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షైష్టా అంబర్ మాట్లాడుతూ ప్రశంసించారు. ఇటువంటి నిర్ణయాలతో భ‌విష్య‌త్తులో ట్రిపుల్ తలాక్ జాడ్యానికి చెక్ పెట్టవచ్చన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/