Begin typing your search above and press return to search.
నన్ను చొక్కా పట్టుకొనే పక్కన పడేశారు - లాఠీలతో కొట్టారు..!
By: Tupaki Desk | 1 Oct 2020 3:30 PM GMTదేశం మొత్తం ఇప్పుడు హత్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం పై అట్టుడుకుతుంది. యూపీ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు దండెత్తుతున్నాయి. హత్రాస్ లో నలుగురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురై.. రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసిన బాధితురాలికి న్యాయం చేయాలంటూ యోగి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ ప్రియాంకా గాంధీ వాద్రా, ఎంపీ రాహుల్ గాంధీ హత్రాస్ కు వెళ్లడం, తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
హత్రాస్ కు బయలుదేరిన ఆ ఇద్దరు నేతల వాహనాలను పోలీసులు యమునా ఎక్స్ ప్రెస్ పై అడ్డుకున్నారు. వాహనాలు ముందుకు వెళ్లకుండా అడ్డు పడ్డారు. హత్రాస్‌కు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశామని, వెనక్కి తిరిగి వెళ్లిపోవాలంటూ సూచించారు. దీనికి ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ అంగీకరించలేదు. దీనితో పోలీసులు బలవంతంగా వారిని కారు నుంచి కిందికి దింపడానికి ప్రయత్నించగా కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక క్యాన్వాయ్ ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో దాంతో పాదయాత్రగా నడుచుకుంటూ బయలుదేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకొని నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగడంతో పోలీసులు వారిపై దాడి చేసి , రాహుల్ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు.
హత్రాస్ వైపు వెళ్లడాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు తనను లాఠీలతో కొట్టారని, చొక్కా పట్టుకుని ఈడ్చి రోడ్డున పడేశారని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ రోడ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే నడవాలా ఆయనకు మాత్రమే నడవడానికి హక్కు ఉందా ఇంకెరికీ లేదా అని నిలదీశారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి శాంతియుతంగా వెళ్తోన్న తమను అడ్డుకుని ఏం సాధిస్తారని, ప్రజలకు ఎలాంటి సంకేతాలను పంపిస్తారని రాహుల్ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ట్విట్టర్ వేదికగా నిరసనలు వ్యక్తం చేశారు ఆ పార్టీ కార్యకర్తలు. రాహుల్ అరెస్టుపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ను చూసి సీఎం యోగి ఆదిత్యనాథ్ భయపడుతున్నారా అని ప్రశ్నించారు.