Begin typing your search above and press return to search.
యోగి రాజ్యంలో నడిరోడ్డు మీద ఏడ్చేసిన పోలీస్!
By: Tupaki Desk | 12 Aug 2022 4:20 AM GMTమీరు చదివింది కరెక్టే. దేశానికి రోల్ మోడల్ గా తరచూ చెప్పుకునే ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కారుకు చెంపదెబ్బ మాదిరి తాజా ఉదంతం నెలకొంది. యూపీ గొప్పలు దేశానికి ఏ మాత్రం ఆదర్శం కాదన్నట్లుగా తాజా పరిణామం చోటు చేసుకుంది. రెక్కలు ముక్కలు చేసుకొని.. రోజుకు 12 గంటల పాటు కష్టపడి డ్యూటీ చేసే పోలీసులకు పెట్టే భోజనం ఇదేనా? అంటూ ఒక కానిస్టేబుల్ రోదించిన వైనం షాకింగ్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లోని పోలీసు మెస్ లో అందించే భోజనం ఏ మాత్రం బాగోవటం లేదని వాపోతూ.. ఒక పోలీసు కానిస్టేబుల్ నడి రోడ్డు మీదకు వచ్చి విలపించాడు. భోజనం బాగోకున్నా.. నోరు మెదపకుండా గుట్టుగా తినేసే మిగిలిన వారికి భిన్నంగా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలనుకున్న సదరు పోలీస్ కానిస్టేబుల్ తీరు యోగి సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. కోర్టు వద్ద భదత్రా విధులు నిర్వర్తించే మనోజ్ కుమార్ అనే కానిస్టేబుల్ తమ గోడును వెళ్లబోసుకున్నాడు.
కానిస్టేబుళ్ల పోషకాహారం కోసం రూ.1875 ఇస్తామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఏమైందని అతను ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
దీంతో ఉలిక్కిపడిన పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. విధులకు గైర్హాజరు కావటం.. క్రమశిక్షణరారాహిత్యంతో సహా మనోజ్ మీద 15 కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. తాజా ఉదంతంతో పాటు వాటి సంగతి కూడా చూడాలంటూ సీఐను సీనియర్ ఎస్పీ ఆశిష్ ఆదేశాలు జారీ చేశారు.
గతంలో కూడా ఇదే తీరులో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపినప్పుడు క్రమశిక్షణారాహిత్యం కాకుండా ఇంకేం ఉంటుంది? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.
ఇక.. కానిస్టేబుల్ లేవనెత్తిన న్యాయమైన సమస్యను పరిష్కరించే దిశగా యోగి సర్కారు రియాక్టు అయితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ప్రశ్నించిన పోలీసు కానిస్టేబుల్ మీద చర్యలు సరే.. ఇంతకీ అతను లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం మాటేమిటో?