Begin typing your search above and press return to search.
యోగీ హెయిర్‌స్టైల్లో వస్తేనే స్కూల్లోకి ఎంట్రీ
By: Tupaki Desk | 28 April 2017 8:21 AM GMTఇప్పుడు ఇండియాకు కొత్త ఫీవర్ వచ్చింది.. అది యోగీ ఆదిత్యనాథ్ ఫీవర్. ముఖ్యంగా యోగి పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఇది మరింత ఎక్కువగా ఉంది. కంప్లీట్ హిందూ ఇమేజి ఉన్న యోగి పట్ల హిందూత్వ వాదులు యమ క్రేజ్ చూపిస్తుండగా... పాలనలో ఆయన సృష్టిస్తున్న కొత్త ట్రెండుతో హిందూవాదంపై ఆసక్తి లేనివారు కూడా యోగిని అభిమానిస్తున్నారు. అయితే.. ఒక్కోసారి ఇది శ్రుతిమించుతోంది. తాజాగా యూపీలోని కొన్ని స్కూళ్లు ఇలాగే యోగి క్రేజ్ తో కొత్తకొత్త విధానాలు అమలు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు.
యోగీ ఆదిత్యానాథ్ దగ్గర మెప్పుపొందడానికి కొన్ని స్కూళ్లు విచిత్రమైన ఎత్తుగడులు వేశాయి. మీరట్ లోని రిషబ్ అకాడమీ స్కూల్ యాజమాన్యం తమ విద్యార్ధులను యోగీ ఆదిత్యనాథ్ లాగా హెయిర్ కట్ చేయించుకోవాలని ఆదేశించింది. ఆ విషయం తెలిసిన విద్యార్ధుల తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వచ్చి నిరసనలకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సమస్య పెద్దదవుతుందనుకున్న స్కూల్ యాజమాన్యం మేము అలా చెప్పలేదు. మంచి దుస్తులు వేసుకోవాలని, సరైన హెయిర్ కట్ చేసుకోవాలని మాత్రమే చెప్పామని, విద్యార్ధులకు మంచి నడవడిక నేర్పడం కోసం చెప్పామే తప్ప మాకు మరో ఉద్దేశం లేదని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.
కాగా ఇప్పటికే ఆ స్కూల్ యాజమన్యం విద్యార్ధులు తెచ్చుకునే భోజనంలో మాంసాహార పదార్ధాలు ఉండకూడదని ఆంక్షలు విధించింది. ఇవన్నీ ఎలా ఉన్నా ఇలా హెయిర్ కట్ కూడా మార్చుకోమనడంతోనే వివాదం మొదలైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/