Begin typing your search above and press return to search.

గోహత్య చేస్తే 10 ఏళ్ల జైలు..5 లక్షల జరిమానా

By:  Tupaki Desk   |   11 Jun 2020 6:00 AM GMT
గోహత్య చేస్తే 10 ఏళ్ల జైలు..5 లక్షల జరిమానా
X
స్వయంగా గోసంరక్షకుడు, సాధువు అయిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ గోవులపై ప్రేమను చూపించాడు. గోహత్యకు కఠిన శిక్షలు విధించేలా చట్టసవరణ చేశారు.

గోహత్య నిషేధ చట్టం 1955ని సవరిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ మేరకు సీఎం యోగి ఆధిత్యనాథ్ కేబినెట్ ఈ ఆర్డినెన్స్ ను ఆమోదించింది. గోవధ నిషేధ చట్టం నిబంధనలు పూర్తిగా సవరించారు.

ఇక ఉత్తరప్రదేశ్ లో గోహత్యకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దాంతోపాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధిస్తారు. గోవును గాయపరిస్తే ఏడేళ్ల జైలు, 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు.

తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. గోవులను అక్రమంగా తరలిస్తే సదురు వాహన యజమానితో పాటు డ్రైవర్, ఆపరేటర్ బాధ్యులవుతారు. పరిహారాన్ని యజమాని నుంచే వసూలు చేస్తారు.

ఇక నుంచి గోవులకు వేళకు ఆహారం, నీరు అందించలేకపోయినా నేరంగా భావిస్తారు. గోవుల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతని యూపీ ప్రభుత్వం తెలిపింది. అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రోజే గోవధ నిషేధ చట్టం అమలు చేయడం విశేషం.