Begin typing your search above and press return to search.

ఆగ్రా కూర‌గాయ‌ల మార్కెట్‌ లో క‌రోనా క‌ల్లోలం..ఏకంగా 28మందికి

By:  Tupaki Desk   |   5 May 2020 8:50 AM GMT
ఆగ్రా కూర‌గాయ‌ల మార్కెట్‌ లో క‌రోనా క‌ల్లోలం..ఏకంగా 28మందికి
X
క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ నిత్యావ‌స‌ర‌.. అత్యావ‌స‌ర వస్తువులు విక్ర‌యించే వాటికి మిన‌హాయింపు ఇచ్చిన తెలిసిందే. అయితే ఆ మిన‌హాయింపు ఇచ్చిన వాటి ద్వారా ఇప్పుడు క‌రోనా వేగంగా విస్త‌రిస్తోంది. మార్కెట్ ప్రాంతాలు క‌రోనా వ్యాప్తి కేంద్రాలుగా మారాయి. తెలంగాణ‌లోని సూర్యాపేట‌, మ‌ల‌క్‌పేట మార్కెట్‌ల‌లో క‌రోనా వైర‌స్ విజృంభించిన విష‌యం తెలిసిందే. తాజాగా ప‌ర్యాట‌క ప్రాంతం ఆగ్రాలో కూడా మార్కెట్ ద్వారా ఏకంగా 28 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ఆగ్రాలో గ‌డిచిన 10 రోజుల్లోనే 28 మంది కూర‌గాయ‌ల వ్యాపారులు క‌రోనా వైరస్ బారిన ప‌డ్డారు.

ఆ సోకిన వారిలో అధికంగా బాసాయి, తాజ్‌గంజ్ మండీల్లో కూర‌గాయ‌లు విక్ర‌యించేవారని అధికారులు గుర్తించారు. దీంతో ఆగ్రాలో ప‌రిస్థితులు ఆందోళ‌న‌కరంగా మారింది. ఎందుకంటే కూర‌గాయలు కొన‌డానికి వ‌చ్చిన ప్ర‌జ‌లకు కూడా క‌రోనా వ్యాపించి ఉంటుందేమోన‌ని భ‌యాందోళ‌న ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో మిగ‌తా వ్యాపారులు, కిరాణా దుకాణాదారుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఇక కూర‌గాయలు కొన్న ప్ర‌జ‌ల‌ను గుర్తించేందుకు అధికారుల‌కు క‌ష్ట‌మైంది. వారి ఎలా గుర్తించాలో.. ఎక్క‌డ ఉన్నారోన‌ని అధికార యంత్రాంగం ఆందోళ‌న చెందుతోంది.

కూర‌గాయ‌ల వ్యాపారుల‌కు క‌రోనా వైర‌స్ ఎలా సోకింద‌నే ఇంత‌వ‌ర‌కు తెలియ‌లేదు. ఈ మార్కె్‌లో మొత్తం 160 మంది కూర‌గాయ‌ల వ్యాపారులు, వీధి వ్యాపారుల‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వీరిలో 28 మందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వారి ద‌గ్గ‌ర కూర‌గాయ‌లు కొన్న కొంత‌మందిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. మిగ‌తా వారిని గుర్తించే ప‌నిలో ఉన్నారు. ప్ర‌స్తుతం మార్కెట్‌ను మూసేయ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఇంటింటికి కూర‌గాయ‌లు అందించాల‌ని పోలీసులు, అధికారులు నిర్ణ‌యించారు. ఇంటింటికీ కూర‌గాయ‌లు ప్యాకెడ్ క‌వ‌ర్ల‌లో డోర్ డెలివ‌రీ చేస్తున్న‌ట్లు ఆగ్రా ఎస్పీ రోహ‌న్ బోట్రే తెలిపారు.

ఇప్ప‌టికే ఆగ్రాలోని 20 వార్డుల్లో ఇంటింటికీ కూర‌గాయ‌లు పంపిణీ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లోనే 100 వార్డుల్లో పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆగ్రా మార్కెట్ పాల‌క‌వ‌ర్గం తెలిపంది. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉండ‌డంతో ఆగ్రాలోని మిగ‌తా దుకాణాల‌కు స్ప‌ష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భౌతిక దూరం పాటించాల‌ని.. మాస్క్‌లు ధ‌రించాల‌ని, శానిటైజ‌ర్ వాడాల‌ని అన్ని పండ్ల దుకాణాలు, ఇత‌ర వీధి మార్కెట్ల‌కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.