Begin typing your search above and press return to search.
యూపీ : తొలి విడతలో హిబాబ్ వివాదం ప్రభావం ఎంత?
By: Tupaki Desk | 11 Feb 2022 3:58 AM GMTనిన్నటివేళ యూపీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికలు జరిగాయి. మొత్తం 58 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. రెండు కోట్ల మందికి పైగా ఓటర్లను ప్రభావితం చేసే తొలి విడత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా బీజేపీ మరియు ఎస్పీ నిలిచాయి.అయితే అవి హోరాహోరీగా తలపడ్డాయా లేదా అన్నది ఇంకొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది.
కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం ప్రకారం చెబుతున్న సమాచారం ప్రకారం బీజేపీ 53 స్థానాలు గెలుచుకోవడంఖాయం అని ఢంకా భజాయిస్తున్నాయి.అంతేకాకుండా యూపీలోమరోసారి యోగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కూడా చెబుతున్నాయి.ఈ విశ్లేషణలు ఎలా ఉన్నా కూడా రాష్ట్రంలో బీజేపీ నిలదొక్కుకుంటే దేశంలో బీజేపీ నిలదొక్కుకుంటుందని ఓ నినాదం ఓ స్పష్టమయిన వైఖరి రూపాన ఎప్పటి నుంచో వినిపిస్తూ వస్తుంది.అయితే ఉత్తరప్రదేశ్ పై హిజాబ్ ప్రభావం ఉంటే ఉండవచ్చు.ఎందుకంటే తరువాత విడతల్లో జరిగే ఎన్నికల్లో వాటి ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉండొచ్చు.కర్ణాటకలో రూలింగ్ చేస్తున్న గవర్నమెంట్ బీజేపీనే కనుక ఆ నిర్ణయాల ప్రభావం కాస్తో కూస్తో ఉత్తరాదిపై ఉండడంలో తప్పేం లేదు.ఒకవేళ మైనార్టీ ఓట్లను ఓవైసీ తీవ్రంగా ప్రభావితం చేస్తే ఆ లాభం బీజేపీకి ఎక్కువ ఉంటుందని కొందరు అంటున్నారు. ఓవైసీ ఎక్కడున్నా సరే ఆయన ప్రభావంకానీ ఆయన చేసే మేలు కానీ ఎప్పుడూ బీజేపీ వైపే ఉంటుంది.ఇక యాదవులు ప్రధానంగా ఉన్న ఈ ప్రాంతాలలో ఓటు బ్యాంకు రాజకీయం మొత్తం హిందుత్వం చుట్టూనే తిరుగుతుంది.
తనకు కలలో కృష్ణుడు కనిపించాడని, రామ రాజ్యం నెలకొల్పాలని అఖిలేశ్ యాదవ్ చెప్పినా, లేదు లేదు రామ రాజ్యం స్థాపన, రామాలయ నిర్మాణం ఇంకా ఇంకొన్ని బీజేపీతోనే సాధ్యం అని యోగీ గట్టిగా అరిచినా వీటిని ఓటరు ఏ విధంగా చూస్తాడు అన్నదే కీలకం.వీళ్లిద్దరి అరుపులు కన్నా కాంగ్రెస్ అరుపే బాగుంది.
వాళ్లు ఉద్యోగాల విషయమై ఓ స్పష్టమైన మాట ఒకటి వినిపిస్తూ వస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే నిరుద్యోగులు కాస్తో కూస్తో ప్రియాంక చెప్పిన మాట వైపు మొగ్గు చూపితే సంబంధిత ఓటు బ్యాంకు కూడా చీలిపోవడం ఖాయం. కనుక దేశానికి
హిందుత్వం కన్నా హిజాబ్ వివాదం కన్నా ముఖ్యమైంది నిరుద్యోగ నిర్మూలన. కానీ ప్రియాంక చివర్లో హిజాబ్ కట్టుకున్నా,బికినీ వేసుకున్నా అదంతా స్వేచ్ఛలో భాగం అని చెప్పి వివాదాన్ని పొడిగించారు. ఈ మాటలు సంస్కృతికి ఆనవాలుగా నిలిచే
ప్రాంతం అయిన ఉత్తర ప్రదేశ్ లో కాస్తో కూస్తో వ్యతిరేకతకు కారణం కావొచ్చు.లేదా మైనార్టీలను ఆకర్షింపజేయవచ్చు.అప్పుడు ఓవైసీతో పాటు కాంగ్రెస్ కూడా బీజేపీకి మరింత మేలు చేసిన నాయకులుగా ఈ ఎన్నికల చరిత్రలో నిలిచిపోవడం అన్నది ఖాయం.