Begin typing your search above and press return to search.

ఆధార్ లో కోట్లకు టెండర్ పెట్టారు

By:  Tupaki Desk   |   20 Sep 2015 9:04 AM GMT
ఆధార్ లో కోట్లకు టెండర్ పెట్టారు
X
యూపీఏ హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణం వెలుగులోనికి వచ్చింది. 13వేల కోట్ల రూపాయల విలువైన ఆధార్ కార్డుల ప్రాజెక్టులను టెండర్లు పిలవకుండానే గత యూపీఏ సర్కార్ ధారాదత్తం చేసినట్లు తేలింది. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోనికి వచ్చింది.

అనిల్ గల్గాయి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా యుఐడిఎఐ అధికారులకు ఆధార్ కార్డు ప్రాజెక్టులపై పలు దరఖాస్తులు పెట్టారు. వీటికి పబ్లిక్ ఇన్ ఫర్మేషన్ ఆఫీసర్ ఎస్ ఎస్ బిస్త్, డెప్యూటీ డైరెక్టర్ ఆర్.హరీశ్ ల సమాధానంలో అప్పటి యుఐడిఎఐ అధినేత నందన్ నీలెకని హయాంలో ఎటువంటి టెండర్లూ లేకుండానే ఆధార్ కార్డుల ప్రాజెక్టుల కోసం 13, 663.22 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు వివరాలు ఇచ్చారు. అప్పట్లో ఇచ్చిన మొత్తం ప్రాజెక్టు కాంట్రాక్టుల విలువ 13, 663.22 కోట్ల రూపాయలు కాగా 6,563 కోట్ల రూపాయలు 90.3 కోట్ల ఆధార్ కార్డుల జారీ కోసం వ్యయం చేసినట్లు ఆ సమాధానాల్లో ఉంది. ఇలా మొత్తం 25 కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారట.

అన్నిటికీ ఆధార్ తప్పనిసరి అనే ప్రభుత్వాలు.. ఆ ఆధార్ కార్డుల ప్రక్రియ చేపట్టే సంస్థలకు టెండర్లు పిలవడం తప్పనిసరి అని ఎందుకు గుర్తించలేకపోయాయో మరి. కోట్లకు టెండర్ పెట్టేటప్పుడు టెండర్ పిలవడం ఎందుకనుకున్నారో ఏమో.