Begin typing your search above and press return to search.

సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్-ఉపాస‌న‌

By:  Tupaki Desk   |   28 Jan 2019 4:20 AM GMT
సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్-ఉపాస‌న‌
X
అరుదైన పెద్ద పులుల జాతి అంత‌రించిపోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. కాల‌క్ర‌మంలో పెద్ద పులిని యానిమ‌ల్ మ్యూజియంలో చూడాల్సిన స‌న్నివేశం దాపురించేట్టు ఉంద‌న్న ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం, అడ‌వులు అంత‌రించిపోవ‌డం, మ‌నిషి పేరాశ‌ వంటి ప్ర‌మాదాల వ‌ల్ల అరుదైన ఈ జాతి అంత‌రించిపోతోంది. అయితే ఇలాంటి విష‌యాల్ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా, మీడియా మాధ్య‌మంగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు సెల‌బ్రిటీలు కంక‌ణం క‌ట్టుకోవాల్సిన సంద‌ర్భం ఉంది. ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆ బాధ్య‌త‌ను తీసుకోవ‌డం హ‌ర్ష‌ణీయం.

`సేవ్ ఇండియాస్ బిగ్ క్యాట్స్` అంటూ వ‌న్య‌ప్రాని సంర‌క్ష‌ణ కోసం ఉపాస‌న త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చారిటి విభాగానికి ఉపాధ్యక్షురాలైన ఉపాస‌న వీలున్నప్పుడల్లా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న సంగ‌తి విధిత‌మే. ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విష‌యాల‌పై ఉపాస‌న ప్ర‌జ‌ల్ని చైత‌న్య వంతుల్ని చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వ్యాపార వాణిజ్య రంగాల్లోనూ అసాధార‌ణ విజ్ఞానంతో ఎంట‌ర్ ప్రెన్యూర్ గా వెలుగొందుతున్న ఉపాస‌న సామాజిక విజ్ఞానం - జిజ్ఞాస‌తో మైమ‌రిపిస్తున్నారు.

తాజాగా `సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్` పేరుతో పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించటానికి ఉపాస‌న‌ రాజస్థాన్ కు వెళ్లారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సహకారంతో ఈ శిబిరాన్ని ర‌న్ చేస్తున్నారు. వన్యప్రాణి ఔత్సాహికులైన 12 మంది పాఠశాల బాలికలు ఈ శిబిరానికి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. పెద్ద పులుల‌తో పాటు వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌పై చేప‌డుతున్న అరుదైన కార్య‌క్ర‌మ‌మిది.