Begin typing your search above and press return to search.
బీజేపీ డబుల్ ఇంజన్ అంటే... అందరూ అదే అనుకుంటున్నారా...?
By: Tupaki Desk | 20 May 2022 11:30 AM GMTఈ మధ్య కాలంలో జాతీయ పార్టీ బీజేపీ నేతల నుంచి గల్లీ స్థాయి బీజేపీ నేతల వరకూ పెద్దగా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ మధ్య రచ్చబండలో కొందరు సీనియర్ పొలిటీషియన్లు ఈ డబుల్ ఇంజన్ అంటే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమే అని ఒక్క లెక్కన సెటైర్లు వేస్తున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో బాగుపడింది ఎవరు అంటే డబుల్ ఇంజన్ మాదిరిగా అదానీ, అంబానీలే అని కూడా కొందరు నాయకులు అంటున్నారు. ప్రజలు బాగుపడలేదు కానీ ఇలా పెద్దవాళ్ళే డబుల్ ఇంజన్ స్లోగన్ తో బాగుపడ్డారు అని కూడా అంటున్నారు.
ఇక బీజేపీ లో చూస్తే డబుల్ ఇంజన్ ఎవరంటే మోడీ, షాలను చూపిస్తున్నారు. వారి విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అంత కంటే ఎక్కువ కష్టపడుతున్న మాకు ఏ రకమైన గుర్తింపు ప్రచారం దక్కలేదు అని కూడా బీజేపీలోనే అంటున్నారు.
ఇక చూస్తే బీజేపీలో ఎందరో జాతీయ స్థాయి నేతలు ఉన్నారు వారు విశేష అనుభవం కలిగిన వారు. వారి మోడీ షాల కంటే ముందు గానే జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి రాణించారు కూడా. ఇపుడు మోడీ షా డబుల్ ఇంజన్ మాదిరిగా దూసుకుపోతూంటే వారంతా బ్యాక్ బెంచీలకు పరిమితం అయ్యారు.
మొత్తానికి చూస్తే డబుల్ ఇంజన్ స్లోగన్ తో కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ ఒకేసారి అధికారాన్ని హస్తగతం చేసుకుందామన్ని బీజేపీ పెద్దలు చూస్తున్నారు. అయితే ఇది చివరికి అటు ఇటు తిరిగి డబుల్ ఇంజన్ స్లోగన్ కాస్తా బీజేపీ మెడకే చుట్టుకునేలా ఉంది అంటున్నారు.
డబుల్ ఇంజన్ అంటే మోడీ షా అని, అదానీ, అంబానీ అని పెట్రోల్ డీజిల్ అని ప్రత్యర్ధి పార్టీలు విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే మాత్రం కాషాయ పార్టీకి ఈ రోజు ముద్దుగా ఉన్న ఈ డబుల్ ఇంజన్ నినాదమే వద్దు బాబోయ్ అనిపిస్తుంది అని కూడా అంటున్నారు. మొత్తానికి డబుల్ ఇంజన్ అని బీజేపీ వారి మరింత స్ట్రాంగ్ గా ఇక మీదట అనగలరా. లేక ఈ స్లోగన్ని మార్చేసుకుంటారా. ఏమో చూడాలి.