Begin typing your search above and press return to search.
బాబూ నేనూ... తేడా చూడండి...?
By: Tupaki Desk | 28 April 2022 11:46 AM GMTతేడాయే ఎవరినైనా ఒక మెట్టు పైన ఉంచుతుంది. లేదా దించుతుంది. ఇక రాజకీయాల్లో నేతల మధ్య పోలికలు తేడాలు చూడడం జనాలకు పెద్ద పని. ఎందుకంటే వారే అసలైన తీర్పరులు కనుక. అయితే ఇపుడు ఆ జనాలకు నేతాశ్రీలు వారు ఏం చూడాలో తేడాల మీద ఎలా ఆలోచన చేయాలో కూడా విడమరచి చెబుతున్నారు. ఏపీలో చూస్తే జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. జగన్ యువ నాయకుడు. పుష్కర కాల రాజకీయ అనుభవం. మూడేళ్ళుగా సీఎం గా ఉన్నారు.
అదే బాబు అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన పదునాలుగు సంవత్సరాలు సీఎం గా ఉన్నారు. ఆయన అనుభవమే నేను అని చెబుతారు.మరి ఈ ఇద్దరి మధ్యన 2014 ఎన్నికల్లో జనాలు పోలిక పెట్టి చూశారు. అనుభవంలో మార్కులు బాబుకే వేసి సీఎం కిరీటం తగిలించారు. 2019 నాటికి జగన్ ఒక్క చాన్స్ నినాదం బాగా పనిచేసింది. ఒక సునామీలా జనాభిమానం మారింది. దాంతో ఆయన సీఎం అయిపోయారు.
ఇక 2024 నాటికి జగన్ కి కొత్త నినాదం ఏంటి అన్నది అంతా చూస్తున్నారు. మరో వైపు చంద్రబాబు అయితే ఏపీ పునర్నిర్మాణం అని ఒక కిక్కించే స్లోగన్నే ఎంచుకున్నారు. మరి అధికారంలో ఉన్న జగన్ కి కూడా జనాలను షేక్ చేసే నినాదం కావాలి కదా. అందుకే ఆయన అటు బాబూ ఇటు నేనూ తేడా చూడండి అంటున్నారు.
ఇది అచ్చం 2014లో టీడీపీ ఇచ్చిన నినాదంగానే ఉంది. నాడు అనుభవం తో మార్కులు కొట్టేయడానికి బాబు అలా పిలుపు ఇచ్చారు. ఇపుడు చంద్రబాబు కంటే తాను మిన్న అనిపించుకోవడానికి జగన్ తేడా మా ఇద్దరికీ చూడండి అని సంక్షేమ పధకాల విషయం ప్రస్థావిస్తున్నారు. ఆయనకు పేదలంటే ఇష్టం లేదు అని కూడా జగన్ చెప్పేస్తున్నారు.
తన మొత్తం పదవీకాలంలో బాబు ఏనాడైనా అయిదు లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చారా అని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదే నేను కేవలం మూడేళ్లలోనే ముప్పయి లక్షల ఇళ్ళ పట్టాలను పేదలకు ఇచ్చాను ఇదీ బాబుకూ జగన్ కి మధ్య తేడా అని చెబుతున్నారు. మీరే దీన్ని జాగ్రత్తగా గమనించాలి అని కూడా కోరుతున్నారు.
ఇక తాను ఏపీ ప్రజల పట్ల మమకారంతో తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుని ఉంటున్నానని, బాబుకు ఏపీ అంటే ప్రేమ లేదు కాబట్టే హైదరాబాద్ లో ప్యాలెస్ కట్టుకుని అక్కడ కొలువు తీరారు. ఆయన ప్రవాసాంధ్రుడు. నేనే ఏపీ ప్రజలకు అసలైన బంధువుని అని జగన్ చెబుతున్నారు. ఇక ఇచ్చిన ప్రతీ హామీని నేను నెరవేర్చాను. చంద్రబాబు హామీలు ఎపుడైనా అమలు చేశారా. ఈ తేడాను కూడా గమనించండి , ఆలోచించండి అని జగన్ గట్టిగానే కోరుతున్నారు.
మరి ప్రజలకు ఈ తేడాలు కనిపిస్తున్నాయా. లేక అప్పులు చంద్రబాబు మూడు లక్షల కోట్లు చేస్తే జగన్ అంతకు మించి చేయడమే కనిపిస్తోందా. బాబు ఏలుబడిలో రోడ్లు ఇతర అభివృద్ధి పనులు జరిగితే జగన్ పాలనలో అద్వాన్నమైన రహదారులు కనిపిస్తున్నాయ. అయినా తన ప్లస్ పాయింట్స్ చూపించి తేడా చూడమని జగన్ అడగడం సబబే కానీ జనాలకు వారి కష్టాలు కూడా కనిపిస్తాయి కదా. అది కదా లాజిక్ పాయింట్.
ఇక చంద్రబాబు కూడా తాను అభివృద్ధి చేసే నేతను, జగన్ అభివృద్ధి నిరోధకుడు అని జనాలను ఆ భారీ తేడా చూడమంటే అపుడు ఈ యువ ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో. మొత్తానికి ఈ తేడాలన్నీ తెలియనంత అమాయకులా జనాలు. వారు కనుక అన్నీ ఆలోచన చేసి ఓటు వేస్తే తేడా కొట్టేది నేతాశ్రీలకే సుమా.