Begin typing your search above and press return to search.
ఏంది అవసరమో కూడా తెలుసుకోలేని నాయకత్వంలో ఎలా గెలిచేది
By: Tupaki Desk | 3 Jun 2022 5:10 AM GMTకాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనబడటంలేదు. మూడురోజుల పాటు రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శివిర్ అనే పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించింది. యువతకు పెద్దపీట వేయాలని, పదవుల్లో యువతకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ చేసింది. పార్టీ సమావేశంలో నాయకత్వం అలా డిసైడ్ చేసిందో లేదో కొద్దిరోజుల తేడాలోనే కీలకమైన యువనేత హార్దిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేసాశారు.
పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వటంలేదని హార్దిక్ రాజీనామా సందర్భంగా ఆరోపించటం గమనార్హం. నిజానికి గుజరాత్ లోని పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం ద్వారా హార్దిక్ పటేల్ వెలుగులోకి వచ్చాడు. హార్దిక్ కు నరేంద్రమోడి ప్రభుత్వం అంటే ఏమాత్రం గిట్టదు.
అందుకనే ఉద్యమ సమయంలో పటేల్ పై గుజరాత్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టి బాగా ఇబ్బందిపెట్టింది. ఎన్నికేసులు పెట్టినా హార్దిక్ అన్నింటినీ భరించారు. చివరకు జైలులో వేసినా తట్టుకున్నారు.
అలాంటి హార్దిక్ చివరకు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ నాయకత్వం గనుక సిన్సియర్ అయ్యుంటే హార్దిక్ కు మంచి ప్రాధాన్యత ఇచ్చుండేదే. ఎందుకేంట గుజరాత్ లో కాంగ్రెస్ అధికారానికి దూరమై రెండు దశాబ్దాలైపోతోంది. కాబట్టి బలమైన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే హార్దిక్ లాంటి యువనేతలు ఇంకా చాలామంది అత్యవసరం. అలాంటిది వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో హార్దిక్ ను దూరం చేసుకుంటుందా ?
హార్దిక్ ద్వారా మరింతమంది పటీదార్లను పార్టీలో చేర్చుకుని బలోపేతం కావాల్సిన కాంగ్రెస్ పార్టీ ఉన్న పటీదార్ ను కూడా దూరం చేసుకుంటే ఎలాగ ? ఉన్నవాళ్ళనే వదులుకుంటున్న పార్టీలోకి రేపు ఎవరైనా చేరుతారా ?
విచిత్రమేమిటంటే ఇంతకాలం ఎవరిమీదైతే హార్దిక్ పోరాడాడో మనసుచంపుకుని వేరేదారిలేక చివరకు అదే బీజేపీలో చేరాడు. కాంగ్రెస్ పద్దతి చూసిన తర్వాత గుజరాత్ లో అధికారంలోకి రావటం కలలోని మాటే తప్ప వాస్తవంలో జరగదనే చర్చ పెరిగిపోతోంది.