Begin typing your search above and press return to search.
జేసీల దూకుడుకు బాబు కళ్లెం వేస్తారా?
By: Tupaki Desk | 18 May 2022 10:30 AM GMTఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడుకు పార్టీ అధినేత చంద్రబాబు కళ్లెం వేస్తారా? పిలిచి ఆయనతో చర్చించి.. పార్టీకి ఉపయోగించుకునే కార్యక్రమాని కి శ్రీకారం చుడతారా? లేక అలా చూస్తూ ఉంటారా? ఇదీ.. ఇప్పుడు అనంతపురం జిల్లాలో జరుగుతున్న చర్చ. ప్రస్తు తం టీడీపీ అదినేత చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన జిల్లాల వారీగా సమీక్షలు కూడా చేయనున్నారు. ఈ క్రమంలోనే అనంతపురానికి చెంది జేసీ ప్రభాకర్, దివాకర్ రెడ్డిలతోనూ చంద్రబాబు సమీక్షించాలని.. వారి దూకుడుకు అడ్డుకట్ట వేయా లని.. ఇక్కడి నాయకులు కోరుతున్నారు.
వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకు న్నా.. ఈ ఇద్దరు అన్నదమ్ములు పార్టీని వినియోగించుకున్నారనే వాదన ఉందే తప్ప.. పార్టీకివారు ఎలాం టి సేవలూ చేయలేదనే వాదన వినిపిస్తోంది.
పైగా.. పార్టీకి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న పల్లె రఘునాథరెడ్డి వంటివారికి పొగ పెట్టేలా వ్యవహరిస్తున్నా రు. దీనివల్ల పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. పైగా పార్టీని కూడా రోడ్డున పడేస్తు న్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉంటే పార్టీలో సవ్యంగా ఉండాలని.. లేకపోతే.. వెళ్లిపోవాలనే సంకేతాలు ఇచ్చేలా..చంద్రబాబు గట్టిగా వ్యవహరించాలని.. జిల్లా నాయకులు కోరుతున్నారు. అంతేకా దు.. ఎవరితోనూ.. జేసీలకు సంబంధం లేదు.
ఎవరినీ కలపుకొని కోవడం లేదనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తమ ఆధిపత్యమే చెల్లాలనే విధంగా.. జేసీ వర్గం.. ఇప్పటికీ వ్యవహరిస్తోందని.. గతంలో కాంగ్రెస్‌ను నాశనం చేసి పెట్టారని.. ఇప్పుడు టీడీపీలోనూ అదేధోరణితో వ్యవహరిస్తున్నారని స్థానిక నాయకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వారిని లైన్‌లో పెట్టేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.