Begin typing your search above and press return to search.
నడి మద్దెన ఆషాడం : కారు సారు వారు కామ్ అయిపోతారా ఏంది...?
By: Tupaki Desk | 24 Jun 2022 12:30 PM GMTఆషాడం అంటే కొత్తగా పెళ్ళి అయిన జంటకు భయం. ఎడబాటును తెచ్చే మాసమని తెగ బాధపడతారు. అయితే మంచి పనులు చేయడానికి కాస్తా సెంటిమెంట్లు పట్టింపులు ఉన్న వారికి కూడా ఆషాడం దెబ్బ బాగానే రుచి చూపిస్తుంది. దీన్ని శూన్య మాసం అని అంటారు. అలా ఆషాడం ముంచుకువచ్చేస్తోంది.
ఈ నెల 30 నుంచి ఆషాడం వస్తోంది. దాంతో కారు సారు వారు అదే కేసీయార్ వారు ఇక కాం అయిపోవాల్సిందేనట. అసలే గులాబీ బాస్ కు ముహూర్తాలు, మూఢ నమ్మకాలు ఎక్కువ. దాంతో ఆయన నెల రోజుల పాటు ఫుల్ సైలెంట్ గా ఉంటారని అంటున్నారు.
అసలు కేసీయార్ ఈపాటికి తెగ బిజీగా ఉండాలి. ఆయన కొద్ది రోజుల క్రితమే జాతీయ స్థాయిలో పార్టీని స్థాపిస్తాను అని చెప్పి భారీ ప్రకటన ఇచ్చారు. దాంతో కొంత కదలిక అయితే వచ్చింది. ఇక ఈ నెల 19న పార్టీ ప్రకటన ఉంటుందని కూడా భావించారు. అయితే చడీ చప్పుడూ మాత్రం లేదు. ఈ నేపధ్యంలో చూసుకుంటే గట్టిగా వారం కూడా వ్యాధి లేదు. ముంచుకుని మరీ ఆషాడం వస్తోంది.
దాంతో కేసీయార్ జాతీయ పార్టీ ప్రకటనకు కొంత విరామం ఇస్తున్నారు అని అంటున్నారు. ఇక అదే సమయంలో కేసీయార్ కొంత సందిగ్దంలో కూడా ఉన్నారని అంటున్నారు. ఆయన భారత రాష్ట్ర సమితి పేరిట కొత్తగా జాతీయ పార్టీని పెట్టాలనుకుంటున్నారు. అలా కనుక చేస్తే ముందుగా టీయారెస్ కార్యవర్గ సమావేశం పెట్టి అక్కడ తీర్మానం చేయాలి. అలాగే బీయారెస్ పేరిట పార్టీ పెట్టి అందులో టీయారెస్ ని విలీనం చేయడమా లేక టీయారెస్ నే కంటియూ చేస్తూ జాతీయ రూపు ఇవ్వడమా అన్నది కూడా కేసీయార్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు చూస్తే కేసీయార్ జాతీయ పార్టీకి పెద్దగా స్పదన అన్నది రాలేదని కూడా అంటున్నారు. ఆయన సైతం భూకంపం సృష్టిస్తాను అని చెప్పి కూడా మమతా బెనర్జీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి మీద మీటింగు పెడితే కేసీయార్ వెళ్లలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిణామాలను కేసీయార్ నిశితంగా పరిశీలిస్తున్నారు అంటున్నారు.
అలాగే మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఆయన గమనిస్తున్నారు అని అంటున్నారు. అలా అన్నీ చూసుకుని ఆషాడం వెళ్ళాక మంచి ముహూర్తాన్ని ఎంచుకుని మరీ జాతీయ పార్టీ ప్రకటన చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జాతీయ రాజకీయాల మీద కేసీయార్ కి ఉత్సాహం అయితే తగ్గలేదు అని అంటున్నారు.