Begin typing your search above and press return to search.
టచ్ మీ నాట్ : వైసీపీకి అసలైన బాధ అదేనా...?
By: Tupaki Desk | 9 May 2022 11:30 PM GMTరాజకీయాల్లో ఒంటరితనాన్ని అంటరాని తనాన్ని ఏ పార్టీ అయినా పూర్తిగా అనుభవించింది అంటే అది ఒక్క బీజేపీనే. ఆ పార్టీని జాతీయ స్థాయిలో ఎంతలా వేధించి సాధించారో గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆ పార్టీతో జట్టు కూడితే అరిష్టమని కూడా నాటి తరం రాజకీయ నేతలు భాష్యాలు చెప్పుకొచ్చారు. ఒక దశలో బీజేపీ రాజకీయ అంటరానితనాన్ని దారుణంగా చవిచూసింది.
దాని మీద ఆ పార్టీకి చెందిన వరిష్ట నేత అటల్ బిహారీ వాజ్ పేయ్ అయితే రాజకీయ అంటరాని తనం అన్నది ఎపుడూ పనికిరాదు అని ఇతర పక్షాలకు హితవు చెప్పారు. కాలక్రమంలో బీజేపీతో చెలిమి చేయడానికి ఎన్నో పార్టీలు ముందుకు వచ్చాయి. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న ఎన్డీయే కూటమిలో నాడు పాతిక దాకా పార్టీలు వచ్చి చేరాయి కూడా. ఇదంతా గతం అయితే ఇపుడు వైసీపీకి ఏపీలో అలాంటి పరిస్థితి ఉందా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది.
ఏపీలో వైసీపీ తమది ఒంటరి పోరు, తాము సోలోగా వస్తామని పదే పదే చెప్పుకుంటూ ఉంటుంది. అయితే ఈ ఒంటరి పోరు కోరి తెచ్చిపెట్టుకున్నదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతాయి. ఎందుచేతనంటే వైసీపీ పుట్టుకతోనే అన్ని పార్టీలకు టార్గెట్ అయింది. నాడు ఒకే సమయంలో అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీకి కూడా కన్నెర్ర అయింది.
అదే సమయంలో జగన్ అవినీతి ఆరోపణల మీద జైలుకు పోవడంతో చాలా పార్టీలు వైసీపీతో జత కలవడానికి జంకి వెనక్కి పోయాయి. ఇక వైసీపీతో పొత్తుల మీద ఆ మధ్య ఒక చానల్ లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వైసీపీ 2014 ఎన్నికల వేళ పొత్తుల కోసం తమతో ప్రయత్నం చేసిందని, తామే వద్దు అనుకున్నామని. అంటే వైసీపీ కూడా ఒకప్పుడు పొత్తుల కోసం ఆలోచన చేసిందా అన్నదే ఇక్కడ పాయింట్.
ఇక వైసీపీతో పొత్తుల కోసం సీపీఎంని కూడా దగ్గరకు తీస్తున్నారు అని ఒక దశలో వినిపించినా అది కూడా వర్కౌట్ కాలేదు. సీపీఎం కూడా వైసీపీ విధానాల మీదనే పోరు చేస్తూ వచ్చింది. ప్రత్యేకించి అవినీతి ఆరోపణలు ఉన్న అధినాయకత్వం అంటూ దూరం జరిగింది అంటారు. ఇక బీజేపీ తో వైసీపీ పొత్తు వార్తలను కూడా ఎప్పటికపుడు బీజేపీ జాతీయ రాష్ట్ర నేతలు ఖండిస్తూ ఉంటారు. అవినీతి కుటుంబ పార్టీలతో తాము పొత్తు పెట్టుకోమని రీసెంట్ గా సోము వీర్రాజు వైసీపీ మీద కామెంట్స్ చేశారు.
ఇక కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారు అని ప్రచారం జరిగినా అది కూడా వర్కౌట్ అయ్యే చాన్స్ లేదు, బీజేపీ వైపు వైసీపీ మొగ్గు చూపుతోంది అన్న ప్రచారం ఉంది. అదే టైమ్ లో కాంగ్రెస్ వారికి కూడా వైసీపీ మీద నిండా గుర్రు ఉందని అంటారు.
ఇలా ఏ పార్టీతో కూడా పొత్తు అన్నది వైసీపీకి పొసగదు, కుదరదు అని తేలిపోయిన మీదటనే ఈ సోలో రాగాలు ఆలపిస్తున్నారు అని కూడా విమర్శలు ఉన్నాయి. దీని మీదనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టిగానే కామెంట్స్ చేశారు.
మీరు ఒంటరిగా కాకుండా ఎలా పోటీ చేస్తారు, అసలు మీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు సిధ్ధంగా ఉంటారు, మీతో పొత్తు అంటేనే ఎవరూ దగ్గరకు రారు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అంటే ఇవన్నీ చూస్తూంటే వైసీపీ పెద్దలకు మనసులో ఎవరితో అయినా పొత్తు కలపాలని ఉన్నా ఎవరూ దరికి రాని పరిస్థితి ఉందా అన్నదే చర్చ. చూడాలి మరి ఎన్నికలు ఇంకా రెండేళ్ళ వ్యవధిలో ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కూడా.