Begin typing your search above and press return to search.
వైసీపి బాధేంటో : నా పొత్తు... నా ఇష్టం...అయినా...?
By: Tupaki Desk | 29 May 2022 5:30 PM GMTరాజకీయ పార్టీలు ఒంటరిగా రావాలా, పొత్తులతో కలసి రావాలా అన్నది వారి ఇష్టం. ఇలాగే పోటీ చేయాలీ అని రాజ్యాంగంలో ఎక్కడా రాసిపెట్టలేదు. అందువల్ల ఎవరు ఎవరితో అయినా చేతులు కలుపుతారు. ఇది పక్కా రాజకీయం, అధికారం కోసం సాగే సమరం. ఈ విషయంలో ఎదుటి పార్టీ నీతులు చెప్పలేదు, చెప్పినా వినేవారు అంతకంటే ఎవరూ లేరు. ఏపీలో ఉన్న సమస్య ఏంటి అంటే మేము సింగిల్ గా సింహంలా వస్తామని వైసీపీ నేతలు అంటారు. మా దారి రహదారి అంటారు. అదే టైమ్ లో మాకు విపరీతమైన బలం ఉంది అని కూడా చెబుతారు.
మీరంతా విడిగా వచ్చినా కలివిడిగా వచ్చినా కూడా వైసీపీని ఏమీ చేయలేరు అని కూడా గర్జిస్తారు. మరి ఇన్ని చెప్పుకున్న వారు తిరిగి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కి సవాల్ చేస్తారు. పొత్తులు లేకుండా ఒంటరిగా మీరు పోటీ చేయగలరా అంటూ దీర్ఘాలు తీస్తారు. నరసన్నపేటలో జరిగిన సామాజిక న్యాయభేరీ సభలో మంత్రి జోగి రమేష్ అయితే టీడీపీ మీద చంద్రబాబు మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
పొత్తులతో తప్ప సొంతంగా పోటీ చేయలేని పార్టీ టీడీపీ అని ఆయన ఎద్దేవా చేశారు. మీరంతా కలసివచ్చినా కూడా జగన్ని ఏమీ చేయలేరని, ఇంచి కూడా కదల్చలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఒక్కరే కాదు, చాలా మంది మంత్రులు మహానాడు మీద కామెంట్స్ చేస్తూ మాకు జనంలో బలముందని, బాబు సభలకు జనాలే లేరని అంటున్నారు.
మరి ఇన్ని మాటలు అంటున్న వైసీపీ వారు పొత్తులు ఎందుకు అని విపక్షాలను ప్రశ్నించడమే విడ్డూరంగా ఉంది. అధికార పక్షానికి చాలా బలం ఉంది. యాభై శాతం పైగా ఓట్లు ఉన్నాయి. మరి విపక్షాలు అంతా కట్టకట్టుకుని వచ్చినా కూడా గెలుస్తామన్న ధీమా ఉన్నపుడు ఈ బేల మాటలు ఎందుకు అన్నదే ప్రశ్న. పొత్తులతో రావద్దు అని అనడాలు కూడా ఎందుకు అన్నది మరో పాయింట్.
పవన్ చంద్రబాబు కలసి పోటీ చేస్తారో చేయరో అది వారి ఇష్టం. ఒకవేళ వారిద్దరూ కలసి పోటీ చేసినా గెలుస్తామన్న ధీమా వైసీపీ వారిలో ఉండాలి కానీ ఈ ఇద్దరూ కలసి పోటీయే చేయవద్దు అన్నట్లుగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తేనే ఓటమి భయం ఏదో అధికార పార్టీని ఆవహించింది అని అంటున్నారు.
నిజంగా ఆ బెంగ బెదురు లేకపోతే గత కొన్ని నెలలుగా పొత్తుల గురించి పదే పదే అధికార పార్టీయే మీడియాలో ఎందుకు పాటపాడుతుంది అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు చూసిన వారికి ఎవరికైనా వైసీపీ గ్రాఫ్ తగ్గుతోంది అన్నది మాత్రం తెలుస్తోంది. బహుశా ఈ వివరాలు అన్నీ దగ్గర పెట్టుకునే అధికార పార్టీ నాయకులు పొత్తుల మీద తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. అయితే వారికి అర్ధం కాని విషయం ఏంటి అంటే పదే పదే పొత్తుల మీద మాట్లాడి తమ బలహీనతను తాము చాటుకుంటున్నామని.