Begin typing your search above and press return to search.

చంద్రునికో మాట !

By:  Tupaki Desk   |   20 April 2022 8:39 AM GMT
చంద్రునికో మాట !
X
ఒక‌ప్పుడు విజ‌న్ ఉన్న సీఎం.ఒక‌ప్పుడు తిరుగులేని సీఎం..అని కూడా రాయాలి. దేశంలో క్రియాశీల‌కం..నేష‌న‌ల్ డెమొక్ర‌టిక్ అల‌యెన్స్ నేత..ఢిల్లీలోనూ మంచి పేరుంది..ఉత్తరాది పార్టీలకు సంబంధించి..ఎర్ర‌న్న‌తో లాబీయింగ్..న‌డిపించేరు కూడా ఒక‌ప్పుడు హైటెక్ సిటీ త‌న క‌ల..త‌రువాత నిజం..ఒక‌ప్పుడు తన మాటే వేదం..ఇప్పుడు త‌న మాటే చెల్ల‌ని వైనం..ఓ ద‌శ‌లో పసుపు పార్టీని న‌లుగురు లాక్కొన్నారు..నారాయ‌ణ సుజ‌నా లాంటి లీడ‌ర్లు పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించారు..అన్న‌ది ఓ విమ‌ర్శ.

అయినా ! బాబు క‌ష్ట‌ప‌డ‌తారు..జెండా అయితే పీకేయ్య‌రు..త‌ప్పు తెలుగుదేశానికి రోజుల్లేవు..అని చెప్ప‌డం త‌ప్పు..బోండా ఉమామహేశ్వ‌ర‌రావు, వ‌ర్ల రామ‌య్య లాంటి నేత‌లు మీడియా ఎదుట క‌బుర్లు చెప్ప‌డం మానుకుంటే పార్టీకి రోజులుంటాయి. విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం వంటి ఉత్త‌రాంధ్ర జిల్లాల‌లో యంగ్ లీడ‌ర్లు ఉన్నారు. వారి ఉనికి గుర్తిస్తే పార్టీ బాగుంటుంది..లేదంటే కామ‌న్ డీపీ సెల‌బ్రేష‌న్ల‌కే బాబు గారి బ‌ర్త్ డే ప‌రిమితం అయిపోతుంది.

ఆత్మ గౌర‌వం - ఓ నినాదం..ఎన్టీఆర్ ది మ‌రియు చంద్ర‌బాబుది కూడా ! జ‌గ‌న్ ది ప‌వ‌న్ ది..షర్మిలది కూడా !ఇవాళ చంద్ర‌బాబు బ‌ర్త్ డే (ఏప్రిల్ 20, 2022) నాలుగు మాట‌లు ఆ దిశ‌లో..అండ్ ద టైటిల్ ఈజ్.. చంద్రునికో మాట..

ఉమ్మ‌డి రాష్ట్రంలో వెలుగు.. విభ‌జిత రాష్ట్రంలో వెలుగు ఉమ్మ‌డి రాష్ట్రంలో.. తిరుగులేదు..విభ‌జిత రాష్ట్రంలో ఏం చేయాలో పాలుపో వడం లేదు.. చిన్న రాష్ట్రంలో ఇన్ని రాజ‌కీయాలా! అన్న విధంగా.. తెలుగుదేశం త‌ల‌ప‌ట్టుకుంటుంది. ఏడు ప‌దులు దాటిన పెద్దాయన ఒక్క‌రే క‌ష్ట‌ప‌డుతున్నారు. మిగ‌తా వారంతా ఎటు వెళ్తాం ఇక్క‌డే ఉందాం అన్న విధంగానే ఉంటారు ఉన్నారు. పార్ల‌మెంట్ లో సాధించేదేమీ లేదు.. ఎందుకంటే త‌గినంత బ‌లం లేదు. బ‌లం ఉన్న రోజుల్లో పోరాడిన దాఖ‌లాలే లేవు. మిత్ర‌ప‌క్షంగా ఉంది తెచ్చుకున్న నిధులు అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేశారు. ఆ కోపం నాలో ఉంది. ఇప్పుడేం చేయాల‌నుకుంటున్నారు?

ఉప ఎన్నిక‌ల వేళ తిరుప‌తి వీధుల్లో స‌భ‌ల్లో ఏవేవో చెప్పారు. కానీ ఒక‌ప్పుడు టీడీపీ ఇలా ఉందా ??? మీలానే జ‌గ‌న్ ఓ సూత్రం పాటిస్తున్నారు..మీలానే సొంత సామాజిక వ‌ర్గం నేత‌ల‌తోనే మిమ్మ‌ల్ని తిట్టిస్తున్నారు. ఒక‌ప్పుడు మీరంటే భ‌య‌ప‌డే నాయ‌కులు ఇవాళ లేరు .. పార్టీలో మీరు సీబీఎన్ టీం ను తీసుకువ‌చ్చాక అది రెండుముక్క‌లుగా చీలి పోయింది. ఇప్పుడు వ‌ర్గ పోరులో పార్టీ ఉంది. పార్టీని న‌మ్ముకున్న‌వారికి మీరేం చేయలేదు.. పోనీ న‌మ్ముకున్న వారి కోసం ఏం చేస్తారో అన్న‌ది కూడా చెప్ప‌లేదు.. అలా ఇప్పుడు సంక్షోభంలో ఉంది.. అలా అని వైఎస్సార్సీపీది ఉత్త‌మ పాల‌న అని చెప్ప‌ను.వాళ్ల‌వి మీ క‌న్నా అప‌రిప‌క్వ ఆలోచ‌న‌లు.. ప్ర‌ణాళిక‌లు.. విభ‌జిత రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల డ్రామా న‌డిపేరు.. క‌రోనా వ‌చ్చాక ఆ డ్రామా ఆగిపోయింది.

ఉత్త పుణ్యానికి సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తున్నారు.. మీరూ అంతే వాళ్లూ అంతే.. మీరు సాధించింది ఏంటి?మా శ్రీ‌కాకుళానికి మీరు ఇచ్చిందేంటి? వంశ‌ధార ఫేజ్ 2 స్టేజ్ 2 ఏమ‌యినా అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగారా.. మీరు వెళ్లాక పోనీ వీళ్ల‌యినా అడుగులు వేశారా? ఈ ఏడు పదుల వయ‌స్సులో మీరు ఇంకా క‌ష్ట‌ప‌డ‌డం బాగుంది. అలానే మీరు వ‌ర్గ పోరు దిద్దాలి. అప్పుడే మీ క‌ష్టానికి ఫ‌లం. మ‌రొక్క‌టి ఆ రోజు మీరు ఉన్న‌ప‌ళాన రాజ‌ధాని వ‌దిలివ‌చ్చేశారు.. ఉమ్మ‌డి రాజ‌ధాని లో త‌గాదాలు ఏమున్నాయి.. మీరే కాదు వీళ్లు కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయ‌లేరు.. ఉమ్మ‌డి రాజ‌ధాని ఫ‌లాలు పంచుకోలేరు.. ఏమీ చేయ‌లేరు.. కానీ ఎన్నిక‌ల వేళ ఉప‌న్యాసాలు దంచుతారు. ఇవేవీ ఫ‌లితం ఇవ్వ‌వు. బీజేపీతో దోస్తీ సాధ్యం అయినా కాకున్నా టీడీపీ మ‌ళ్లీ పూర్వ వైభ‌వం తెచ్చుకోవాలంటే ముందు న‌మ్ముకున్న వారిని న‌ట్టేట ముంచే ప‌ని పార్టీలో నాయ‌కులు మానుకుంటే మేలు..ఎనీవే డియ‌ర్ స‌ర్ హ్యాపీ బ‌ర్త్ డే.