Begin typing your search above and press return to search.
ఆది నుంచి 'అంతం' వరకు ఉద్ధవ్ పాలన.. 'మహా' రాజకీయం
By: Tupaki Desk | 30 Jun 2022 3:17 AM GMTఇప్పుడు ఎవరిని కదిపినా.. ఏ ఇద్దరు కలిసినా..ఈ మాటే వినిపిస్తోంది. ఒక రిక్షా వాలా చేసిన రచ్చతో మహా రాష్ట్ర రాజకీయం యూటర్న్ తీసుకుంది. కేవలం 'డిప్యూటీ సీఎం' అన్న ఒకే ఒక్క పదవి కోసం.. తనకు నీడ నిచ్చిన.. తను ఎదిగేందుకు దోహద పడిన పార్టీని కూకటి వేళ్లతో పెకలించేసిన ఆ రిక్షా వాలానే శివసేన రెబల్ గ్రూప్ ప్రతినిధి.. ఆది నుంచి బీజేపీకి అనుంగుగా మారిన నాయకుడు ఏకనాథ్ షిండే! కేవలం ఈయన పదవీ కాంక్షే.. పులి బిడ్డ.. బాల ఠాక్రే కుమారుడు.. ఉద్ధవ్ ఠాక్రేను పిల్లిని చేసింది. ఆది నుంచి అనుమానించినట్టే.. బీజేపీ సర్కారు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసింది!!ప్రజలదే పాపం.. వారికే శాపం!!
మహారాష్ట్ర రాజకీయాలను గమనించినవారు.. ముందు నుంచి పరిశీలించిన వారు ఈ మాటే చెబుతున్నారు. 2019 అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకనా 145 సీట్లు అవసరం. అయితే.. ఈ మేజిక్ ఫిగర్ ఏ పార్టీకీ లభించలేదు. బీజేపీకి 106, శివసేనకు 56, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు.. ఇతరులు కొన్ని చోట్ల విజయం దక్కించుకున్నవారు. దీంతో ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ లబించలేదు.ఎన్నికల చిత్రం.. తర్వాత విచిత్రం
మహారాష్ట్ర ఎన్నికల్లో చిత్రమైన వాతావరణం నెలకొంది..తర్వాత అది విచిత్రంగా మారింది. ఎలాగంటే... ఎన్నికల్లో బీజేపీ-శివసేన పార్టీలు కలిసిపోటీ చేశారు. రెండు పార్టీలూ కలిసి అధికారంలోకి రావాలని, కాంగ్రెస్, ఎన్సీపీలను నేలమట్టం చేయాలని కంకణం కట్టుకున్నాయి. అయితే.. విచిత్రంగా.. ప్రజలు ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. దీంతో బీజేపీకి వచ్చిన 106, శివసేనకు వచ్చిన 56తో కలిపి 162 స్థానాలతో ఇరు పక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించాయి. అయితే.. పాలన పంచుకోవడంలో చర్చలు విఫలమయ్యాయి.
మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి కనుక.. మేమే ఐదేళ్లు పాలిస్తాం.. కావాలంటే.. రెండు మంత్రి పదవులు ఇస్తాం.. అని బీజేపీ ప్రకటించింది. కాదు.. మనం ఎన్నికలకుముందు చేసుకున్న ఫిఫ్టీ-ఫిఫ్టీ అధికారం పంచుకుందాం.. అని శివసేన చెప్పింది. దీనికి బీజేపీ ససేమిరా అంది. దీంతో శివసేన బయటకు వచ్చి.. అప్పటి వరకు తిట్టిపోసిన కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టి.. సర్కారును ఏర్పాటు చేసుకుంది. దీంతో కన్నుకుట్టిన బీజేపీ.. 'అవకాశం' కోసం ఎదురు చూసింది.శివసేనలో పదవీ కాంక్ష!
శివసేనలో సీనియర్ నాయకుడు.. ఏకనాథ్ షిండేకు సీఎం ఉద్దవ్ ఠాక్రే మంత్రి పదవి ఇచ్చారు. అయితే.. తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ఠాక్రే కుమారుడికి కూడా మంత్రి పదవి ఇవ్వడంతో తనకు 'పిల్లోడి'(ఉద్దవ్ కొడుకు)కి తేడా ఏంటని.. ఆయన పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్నారు. ఇది సెగగా మారి.. పార్టీకి చేటు తెచ్చింది. ఏకనాథ్ పదవీ కాంక్షను పసిగట్టిన బీజేపీ ఆయనను మెల్లగా దువ్వడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాజకీయాలు మారిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికలతో..
ఇటీవల శివసేనలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఈనెల 20న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఐదు సీట్లు గెల్చుకుంది. నాలుగు సీట్లు గెల్చేందుకు మాత్రమే ఆ పార్టీకి బలం ఉండగా ఐదు సీట్లు దక్కించుకోవడంపై శివసేనలో అంతర్మథనం మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు భాజపాకు ఓటువేసినట్లు గుర్తించారు. ఫలితాలు వచ్చిన వెంటనే శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ అదృశ్యమయ్యారు. తర్వాత శివసేన ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు.
ఈ క్రమంలో శివసేనకు మొత్తం 56 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. సుమారు 40 మంది షిండే వర్గంలో చేరిపోయారు. పలువురు స్వతంత్రులు కూడా.. మద్దతు ప్రకటించారు. వారంతా అసోంలోని గువాహటిలో మకాం వేసి సంకీర్ణ సర్కారుకు సవాలు విసిరారు. ఫలితంగా...ఎంవీఏ సర్కారు మైనార్టీలో పడిపోయింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి వస్తే.. సంకీర్ణ సర్కారు నుంచి వైదొలిగేందుకు కూడా సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే వర్గం కోరినా.. షిండే శిబిరంలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే బీజేపీ చక్రం తిప్పడం.. గవర్నర్ బలపరీక్షకు ఆదేశించడం.. సుప్రీం కోర్టు దీనిని సమర్ధించడంతో.. ఇక, మనగలగడం సాధ్యం కాదని గుర్తించిన ఉద్ధవ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇక, బీజేపీ పాలన ప్రారంభం కానుంది. ఏదేమైనా..