Begin typing your search above and press return to search.
ఆ 100 నియోజకవర్గాల సంగతేంటి బాబూ!! రాజకీయనేతల చర్చ
By: Tupaki Desk | 19 April 2022 1:30 PM GMTతెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీని.. వచ్చే ఎన్నికల్లోనూ.. అధికారంలోకి తీసుకురావాలని పార్టీ జాతీయ అధ్యక్షులు.. చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు మాత్రమే కాదు.. టీడీపీలోని ప్రతి నేతా కూడా వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీని పరుగులు పెట్టించాలనే అను కుంటున్నారు. అభిమానులుసైతం.. ఉత్సాహంగానే పనిచేస్తున్నారు. అయితే.. ఇదంతా.. నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చూస్తే... రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉంది.
ఎక్కడికక్కడ నాయకులు ఉదాసీనత.. సీనియర్ల మధ్య సఖ్యత లేమివంటివి.. పార్టీని ఇరాకాటంలోకి నెడు తున్నాయి. రాష్ట్రంలో175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఏవిధంగా నాయకులు ముందుకు సాగుతున్నారు అనే విషయాలు నిశితంగా పరిశీలిస్తే.. సుమారు 100 నియోజకవర్గాల్లో పార్టీ ఇబ్బందులు పడుతోంది. వాస్తవానికి ఇటీవలే 40వ వసంతంలోకి అడుగు పెట్టిన టీడీపీ నవనవోన్మేషంగా.. ముందుకు సాగాలని.. అలా సాగేలా చర్యలు తీసుకుంటామని.. నాయకులు సంకల్పం చెప్పుకొన్నారు.
కానీ, ఆ తరహా.. ప్రయత్నాలు ఎక్కడా చేయడం లేదు. గత 2014 ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో 105 స్థానాల్లో మాత్రమే పార్టీ విజయం దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలై .. కేవలం 23 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఇక, వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు మానసికంగా రెడీ అయినా.. భౌతికంగా.. పార్టీని ముందుకు నడిపించేందుకు నాయకులు.. ఇంకా సిద్ధం కాకపోవడం.. గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తే.. ఎన్నిచోట్ల గెలిచే అవకాశం ఉంది? అనేది ఆసక్తిగా మారింది.
ఇప్పటికిప్పుడు ఉన్న అంచనాల మేరకు .. పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమం చేస్తే.. జిల్లాలను ఎంచుకుని పార్టీ కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయా నగరాలు.. జిల్లాల్లో నాయకుల పరిస్థితి.. మూడ్‌ను బట్టి.. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, అనంతపురం వంటి ప్రాంతాలనే పార్టీ అధిష్టానం ఎంచుకుంటోంది. మిగిలిన చోట్ల ఎక్కడా కార్యక్రమాలు పెద్దగా సాగడం లేదు. దీనికి కారణం.. ఆయా నియోజకవర్గాల్లో.. పార్టీకి నాయకులు ఉన్నా.. పట్టించుకోకపోవడం.. తీవ్రమైన ఉదాసీనత... ఇప్పటికీ.. చంద్రబాబుఫేమ్‌తోనే ముందుకు నడవాలని.. గెలవాలని భావిస్తుండడమే.
దీంతో పార్టీ కార్యక్రమాల సంగతి పక్కన పెడితే.. అసలు పార్టీ కేడర్‌ను పట్టించుకుని.. పరుగులు పెట్టించే నాయకులు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన నాయకులు.. ఇప్పటికీ నిర్లిప్తతగా వ్యవహరించడం.. పార్టీ అధినేత ఇచ్చిన పిలుపును కూడా పట్టించుకోక పోవడం.. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కదా..
అప్పుడే ఎందుకు ఈ ప్రయాస అని అనుకోవడం.. వంటివి పార్టీకి అశనిపాతంగా మారాయి. ఈ పరిస్థితినని ఇప్పటికిప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు సమయం కేవలం ఏడాదిన్నర మాత్రమే ఉందని, ఇప్పటి నుంచి చక్కదిద్దే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.